ఇమ్రాన్ ఖాన్ నిజస్వరూపం ఇదా ?

19

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ , పిటిఐ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ రెండవ భార్య రెహమ్ ఖాన్ రాస్తున్న”రెహమ్ ఖాన్” అనే పుస్తకం పాకిస్తాన్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నది . 45 సంవత్సరాల రెహమ్ నయ్యర్ ఖాన్ జర్నలిస్ట్, చిత్ర నిర్మాత . 1993లో ఎజాజ్ రెహ్మాన్ ను వివాహం చేసుకుంది . ముగ్గురు పిల్లలు పుట్టిన తరువాత 2005లో అతనితో విడిపోయింది .

జనవరి 6, 2015న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ , పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు అయిన ఇమ్రాన్ ఖాన్ను వివాహం చేసుకుంది . పెళ్లికాక ముందే రెహమ్ తో అసభ్యంగా ఇమ్రాన్ ప్రవర్తించాడట . వివాహం కాకుండా ఇలాటి వాటికి ఒప్పుకోనని సున్నితంగా చెప్పిందట . నాక్కూడా ఇలాంటి అమ్మాయే కావాలని అనడంతో ఆమె మెదలకుండా ఊరుకొని వివాహం చేసుకుంది . ఆతరువాత ఆమెకు అతని నిజస్వరూపం తెలిసింది . ఇమ్రాన్ ఖాన్ ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో ఆమెకు తెలిసి వచ్చింది . ఇమ్రాన్ సెక్స్ శాడిస్టు అని , అతను హోమో సెక్స్ వల్ అని కూడా ఆమె తన పుస్తకంలో రాసింది .

రెహమ్ ఇమ్రాన్ ఖాన్ తో 30 అక్టోబర్ 2015న విడిపోయింది . ప్రస్తుతం ఆమె రాస్తున్న రెహమ్ ఖాన్ పుస్తకం పెను సంచలనం రేపుతోంది .
రెహమ్ తన జీవిత చరిత్ర రాస్తూ ఈ విషయాలను బయట పెట్టింది . అయితే ఇంకా విడుదల కానీ ఈ పుస్తకం లో కొన్ని అధ్యాయాలు బయటకు రావడంతో ఈ వివాదం రాజుకుంది . ఆమె ఎవరి పేర్లను బయట పెట్టిందో వారు రెహమ్ కు కోర్ట్ నోటీసులు పంపారు .

ఇమ్రాన్ ఖాన్ కు హంజా అలీ అబ్బాసీ , మురాద్ సయీద్ అనే మగవారితో సెక్స్ చేసేవాడని ఆమె పేర్కొంది . ఇమ్రాన్ తన పార్టీకి చెందిన మీడియా కోఆర్డినేటర్ అనిలా ఖవాజా తో అక్రమ సంబంధం ఉన్నట్టు బయట పెట్టింది . దీనిపై పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు .
అయితే ఇదే సమయంలో రెహమ్ కు ఐ ఎస్ ఐ చీఫ్ జహీర్ ఉల్ ఇస్లామ్ తో అక్రమ సంబంధం ఉందని అతని ప్లాన్ ప్రకారమే ఈ మే తనపై అభియోగం మోపుతుందని చెబుతున్నాడు . ఎన్నికల తరుణంలో తన పార్టీని దెబ్బతీయడానికిది పెద్ద కుట్ర అని ఇమ్రాన్ చెబుతున్నాడు .