telugu navyamedia
వ్యాపార వార్తలు

ఆర్‌బీఐ నిర్ణయంతో తగ్గిన గృహ రుణాల వడ్డీరేట్లు

కీల‌క వడ్డీ రేట్ల‌ను య‌థాతధంగా ఉంచుతూ ఆర్‌బీఐ అక్టోబర్‌లో నిర్వహించిన ద్రవ్యవిధాన కమిటీ సమీక్షలో నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 4 శాతంగానే ఉంచింది, మార్చ‌లేదు. దీంతో గృహరుణాల వడ్డీరేట్లు దెబ్బకు దిగొచ్చాయి. చాలా బ్యాంకులు త‌క్కువ వ‌డ్డీపై గృహ రుణాల‌ను అందిస్తున్నాయి. చాలా బ్యాంకులు ప్ర‌స్తుతం గృహ రుణాల‌ను దాదాపు 6.5% వ‌డ్డీతో ప్రారంభిస్తున్నాయి. ఇల్లుకొనే వినియోగ‌దారుల‌కు వ‌డ్డీ రేటు వాతావ‌ర‌ణం అనుకూలంగా క‌నిపిస్తుంది. స‌గ‌టున రుణ మొత్తం, వృత్తి, జెండ‌ర్ మొద‌లైన వాటి ఆధారంగా మెజారిటీ రుణ‌గ్ర‌హీత‌ల‌కు, గృహ రుణ వ‌డ్డీ రేటు చాలా బ్యాంకుల‌లో 6.5% నుండి 7% అంత‌కంటే ఎక్కువ కూడా కొన్ని బ్యాంకుల‌లో ఉంది.

ఈ వ‌డ్డీ రేట్లు పండుగ సీజ‌న్‌లో గృహ డిమాండ్‌ను పెంచడంలో స‌హాయ‌ప‌డ‌తాయి. ముఖ్యంగా డెవ‌ల‌ప‌ర్ల రాయితీలు, రుణ బ్యాంకుల ద్వారా ఆక‌ర్ష‌ణీయ‌మైన ఆఫ‌ర్ల నేప‌థ్యంలో గృహ అమ్మ‌కాలు సాధార‌ణంగా పెరిగే కాలం ఇది. దేశంలో హైద‌రాబాద్‌తో స‌హా 7 న‌గ‌రాల్లో గృహ డిమాండ్‌ను క‌నీసం 10-15% వృద్ధిని చూడ‌వ‌చ్చ‌ని `అన‌రాక్‌` విశ్లేష‌ణ సూచిస్తుంది.

 

ఎస్‌బీఐ, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కోట‌క్ మ‌హీంద్రా మొద‌లైన బ్యాంకులు త‌క్కువ వ‌డ్డీ రేటుకి రుణాలు అంద‌చేయ‌డంలోనూ, గృహ రుణాల స‌ర్వీస్‌లోనూ మంచి ప‌నిత‌నాన్ని చూపిస్తున్నాయి. ఇటీవ‌ల కాలంలో గృహ రుణ వ‌డ్డీ రేట్లు ఇప్ప‌టికే గ‌ణ‌నీయంగా త‌గ్గాయి. ప్ర‌స్తుతం అత్యంత‌ త‌క్కువ స్థాయిలో ఉన్నాయి. ఆస్తి ధ‌ర‌లు స్థిరంగానూ ఉన్నాయి.

ఇటీవ‌ల కొన్ని బ్యాంకులు వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించే చ‌ర్య ప్రోత్సాహ‌క‌రంగా ఉంది. దీంతో గృహ డిమాండ్ కోసం మార్గం సుగ‌మం అవుతుంది. లాక్‌డౌన్ల కార‌ణంగా ఇంత‌కుముందు నిర్ణ‌యం తీసుకోలేని గృహ కొనుగోలుదారులు చాలా మంది ఇపుడు  ఆస‌క్తిగా ఉన్నారు.

బ్యాంక్ ఆఫ్ బ‌రోడా త‌న గృహ రుణ రేట్ల‌లో 25 బీపీఎస్ త‌గ్గింపును 6.75% నుండి 6.50%కి త‌గ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇది అక్టోబ‌ర్ 7, 2021 నుండి ప్రారంభ‌మ‌వుతుంది. ప్రాసెసింగ్ ఫీజు లేకుండా డిసెంబ‌ర్ 31, 2021 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది.

LIC హౌసింగ్ ఫైనాన్స్ త‌న అత్య‌ల్ప గృహ రుణ రేట్ల‌ను 6.66% వ‌ర‌కు త‌గ్గించింది. జీతం, ప్రొఫెష‌న‌ల్ / స‌్వ‌యం ఉపాధితో సంబంధం లేకుండా రుణ‌గ్ర‌హీత‌లంద‌రికీ రూ. 2 కోట్ల వ‌ర‌కు రుణాల‌ను అందిస్తుంది. 2021 సెప్టెంబ‌ర్ నుండి 30 న‌వంబ‌ర్ 2021 వ‌ర‌కు మంజూరు చేసిన రుణాల‌కు ఈ ఆఫ‌ర్ అందుబాటులో ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు గ‌రిష్టంగా రూ. 10 వేలు లేదా రుణ మొత్తంలో 0.25గా ఉంది.

కోట‌క్ మ‌హీంద్రా బ్యాంక్ త‌న గృహ రుణ వ‌డ్డీ రేట్ల‌ను 15 బేసిస్ పాయింట్లు (బీపీఎస్‌) త‌గ్గించి, 6 నవంబ‌ర్ 2021 వ‌ర‌కు ల‌భించే రుణాల‌పై 6.65 నుండి 6.50 శాతానికి త‌గ్గించింది. 6.5% నుండి ప్రారంభ‌మ‌య్యే గృహ రుణం వ‌డ్డీ రేటు అంద‌రికీ వ‌ర్తిస్తుంది.

SBI రుణ మొత్తంతో సంబంధం లేకుండా క్రెడిట్ స్కోర్ లింక్డ్ గృహ రుణాల‌ను కేవ‌లం 6.70% వ‌డ్డీ రేటు వ‌ద్ద అందిస్తుంది. ఈ వ‌డ్డీ రేటు బ్యాలెన్స్ బ‌దిలీ కేసుల‌కు కూడా వ‌ర్తిస్తుంది. బ్యాంక్ ప్రాసెసింగ్ ఫీజుల‌ను కూడా మిన‌హాయిస్తుంది.

HDFC బ్యాంక్ అన్ని రుణ శ్లాబ్‌ల కోసం 800 అంత‌కంటే ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న వినియోగ‌దారులంద‌రికీ 6.70% నుండి గృహ రుణాల‌ను అందిస్తోంది. అక్టోబ‌ర్ 31 వ‌ర‌కు ఎవ‌రైనా సంవ‌త్స‌రానికి 6.70% నుండి HDFC గృహ రుణం పొంద‌వ‌చ్చు. రుణం మొత్తం, ఉపాధి కేట‌గిరితో సంబంధం లేకుండా అన్ని
కొత్త రుణ ద‌ర‌ఖాస్తుల‌కు ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంది.

Related posts