telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు

ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు కూడా జపాన్ వెళ్లనున్నారు. గతంలో ముఖ్యమంత్రి అమెరికా పర్యటన విజయవంతమైంది.

జపాన్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను అధికారులు ఖరారు చేశారు. దాదాపు ఎనిమిది రోజులపాటు జపాన్ పర్యటనలో ఉంటారు సీఎం రేవంత్ రెడ్డి.

ఏప్రిల్ 15 నుంచి 23 వరకు జపాన్లో పర్యటించనున్నట్లు అధికార వర్గాలు తెలిపారు.

జపాన్ లోని కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారితన అభివృద్ధితో పాటు తెలంగాణకు పెట్టుబడులను తీసుకొచ్చే లక్ష్యంతో ఆయన ఈ పర్యటనకు వెళ్తున్నారు.

తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన సందర్భంగా జపాన్ సాంకేతిక అభివృద్ధిని అధ్యయనం చేయడంతోపాటు స్కిల్ యూనివర్సిటీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిందిగా వారిని కోరే ఛాన్స్ ఉంది.

ఒసాకాలో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్ పోలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. రాష్ట్రంలోని అనుకూల పరిస్థితులపై జపాన్ కంపెనీలకు వివరించి రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానించే అవకాశం ఉంది.

ఈసారి పర్యటనలో జపాన్ సంస్థల పెట్టుబడులతో రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి పెరగడంతోపాటు రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

Related posts