జగన్ ఘోర పరాజయం పాలయ్యారు. కనీసం ప్రతిపక్ష హోదా దక్కటం గగనంగా మారింది. టీడీపీ కూటమి అంచనాలకు మించి విజయం సాధించింది.
వైసీపీ ఓటమి కంటే ఆ పార్టీకి వచ్చిన సీట్లు అభిమానులను ఆవేదనకు గురి చేస్తున్నాయి. జగన్ పాలన పైన కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉన్నట్లు గుర్తించినా..
అది ఈ స్థాయిలో ఉందని గుర్తించలేదు. అయితే..జగన్ ఓటమికి ఎక్కడ బీజం పడిందో విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
అసలు వైసీపీ ఓటమికి కారణాలు ఏంటనేది చర్చ మొదలైంది. జగన్ అధికారంలో వచ్చిన పలు నిర్ణయాలు ఈ భారీ ఓటమికి కారణాలుగా కనిపిస్తున్నాయి.
మూడు రాజధానుల వ్యవహారం…ప్రజా వేదిక కూల్చివేతతొ జగన్ పైన తొలి వ్యతిరేకత మొదలైంది. ఎక్కడా పాలనా పరమైన అంశాలు…డెవలప్ మెంట్ గురించి ప్రస్తావన చేయలేదు.
తాను డెవలప్ చేసిన పోర్టులు, నాడు -నేడు సంస్కరణల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లలేక పోయారు.
ఇక..గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఓటమి పాలైంది. ఆ సమయంలోనూ ప్రజల్లో తన పాలన పైన ఎలాంటి అభిప్రాయం ఉందనే సమీక్ష జగన్ చేసుకోలేదు.
పూర్తిగా సంక్షేమ లబ్దిదారులే తనను గెలిపిస్తారనే అతి విశ్వాసంతో కనిపించారు. ఆ గ్రాడ్యుయేట్ ఓటర్లు అసలు మా బటన్ బ్యాచ్ కాదంటూ సజ్జల వంటి వారు చేసిన వ్యాఖ్యలు వారిని మరింత దూరం చేసాయి.
ఊహించని తీర్పు
జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత పనిచేసే కార్యకర్తలు, నేతలను దూరం పెట్టడమే కారణంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
2019కి ముందు తర్వాత వైసీపీలో విజయసాయిరెడ్డి లాంటి బలమైన వైసీపీ వాదులను నమ్మి ముందుకెళ్లిన జగన్ విజయం సాధించారు.
కానీ 2019 తర్వాత వారిని దూరం పెట్టి చెవిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారిని నమ్మి ముందుకెళ్లారు. బలంగా పనిచేసే వైసీపీ కార్యకర్తలను దూరం పెట్టారు.
వైసీపీ ఓటమికి లిక్కర్ పాలసీ కొంపముంచింది.. నాసిరకం మద్యంపై ఎంతో వ్యతిరేకత ఓట్ల రూపంలో వైసీపీ ఓటమికి దారితీసింది.
పలు నియోజకవర్గాల్లో నేతలు..కొందరు పోలీసు అధికారుల తీరు..సోషల్ మీడియా పోస్టింగ్స్ పైన కఠిన వైఖరి సామన్య ప్రజలకు రుచించలేదు. విశాఖలో భూ కబ్జాలు, దారి తప్పిన లా అండ్ ఆర్డర్ ప్రభుత్వ ఇమేజ్ ను దెబ్బ తీసాయి.
నిర్లక్ష్యం..అతి విశ్వాసం
అటు చంద్రబాబు మూడు పార్టీల కూటమిగా ముందుకొచ్చినా బెదరని జగన్…తొలి నుంచి ఆత్మవిశ్వాసంతో కనిపించినా…ప్రచారం సమయంలో అతి విశ్వాసం కనిపించింది.
చంద్రబాబు ప్రచారం చేసిన లాండ్ టైటిల్ యాక్ట్, జగన్ ఫొటోలతో పత్రాలు వంటి వాటి పైన అనుమానాలు క్లియర్ చేయటంలో పార్టీ విఫలమైంది.
పార్టీ కేడర్ కంటే వాలంటీర్ల వ్యవస్థ తో ఎలక్షనీరింగ్ చేసారు. ఎన్నికల ముందు వేమిరెడ్డి, లావు, పార్దసారధి వంటి వారు పార్టీ వీడుతున్నా..వారిని వారించే ప్రయత్నం చేయలేదు.
ఉద్యోగుల్లో ఆగ్రహం ఉందని గుర్తించినా..నేరుగాతో వారితో సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు. సజ్జల వంటి వారితో చర్చలు ఉద్యోగులకు నచ్చేలేదు.
కనీసం ఐఆర్ లాంటి ప్రకటన చేయలేదు. కొన్ని వర్గాల కోసం కొన్ని వర్గాల ప్రజలను దూరం చేసుకున్నారు.
అతివిశ్వాసంత..సాహోసోపేత నిర్ణయాలుగా భావిస్తూ దుస్సాహసం చేసిన జగన్ కు ప్రజలు ఊహించని తీర్పు ఇచ్చారు.
ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నా: లక్ష్మీనారాయణ