telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఖిలాడీ”గా మాస్ మహారాజా ?

RAVITEJA actor

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు మాస్ మహారాజ్ రవితేజ. తాజాగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు కమిటయ్యారు రవితేజ. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు చిత్రవర్గాల సమాచారం. రవితేజ మేనరిజానికి సూటయ్యేలా పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ కథ సిద్ధం చేస్తున్నారట డైరెక్టర్ రమేష్ వర్మ. ఈ చిత్రానికి ‘కిలాడీ’ అనే టైటిల్ అనుకుంటున్నారని తెలుస్తోంది. రవితేజ బాడీ లాంగ్వేజ్‌కి యాప్ట్ అయ్యేలా సన్నివేశాల రూపకల్పన, టైటిల్ ఉండాలనే కోణంలో కిలాడీ అయితేనే సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారట మేకర్స్. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారని టాక్. గతంలో రవితేజ- రమేష్ వర్మ కాంబోలో ‘వీర’ మూవీ ప్రేక్షుకుల ముందుకొచ్చింది. మరోవైపు రవితేజ లేటెస్ట్ మూవీ ‘క్రాక్’ షూటింగ్ ఫినిష్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మే 8నే విడుదల చేయాల్సి ఉండగా.. లాక్‌డౌన్ కారణంగా వాయిదా వేశారు. సరస్వతి ఫిలిం డివిజన్‌ బ్యానర్‌లో బి. మధు నిర్మించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు. చిత్రంలో రవితేజ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా నటించగా, ఆయన సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. 

Related posts