telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

రవితేజ క్రాక్ నుండి రిలీజ్ అయిన పాట…

చాల కాలంగా ఓ హిట్ కోసం ప్రయత్నిస్తున్న మాస్ మహరాజ్ రవితేజా ప్రస్తుతం శ్రుతి హాసన్ జంటగా చేస్తున్న సినిమా క్రాక్. ఈ సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ వాస్తవ సంఘటల ఆధారంగా తెరకెక్కుతుంది. ఇందులో రవితేజ పవరు ఫుల్ పోలీస్‌గా కనిపించనున్నాడు. అయితే ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల విశేష స్పందన అందుకున్నాయి. అయితే ఇటీవల ఈ సినిమా నుంచి బలే తగిలావే బంగారం పాట టీజర్‌ను విడుదల చేశారు. అయితే నేడు ఈ పాటకు సంబంధించి లిరికల్ వీడియోను రలీజ్ చేశారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా, అనిరుద్ ఓకల్స్ ఇచ్చాడు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. అయితే ‘ఆకారం చూస్తే అబ్బబ్బో.. అవతారం చూస్తే అబ్బబ్బో..అదిరే అలంకారం చూస్తే అబ్బబ్బో అంటూ ఈ పాటకు అనిరుద్ స్వరపరిచాడు. ఈ పాట యూత్‌ను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. అయితే రవితేజ తన ఆశలు అని ఈ సినిమా పైనే పెట్టుకున్నాడు. మరి కరిసం ఈ సినిమా అయిన మాస్ మహరాజ్ ను గట్టెక్కిస్తుందా… లేదా అనేది చూడాలి.

Related posts