మాస్ మహారాజా రవితేజ నటించిన సినిమా ‘ఖిలాడి. డైరెక్టర్ రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. రవితేజ సరసన డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ , పాటలు, అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు ఈ మూవీ యూనిట్.
ట్రైలర్ చూస్తే… రవితేజ డబుల్ రోల్ చేస్తున్నట్లు చూపించారు. ఒకరు మనీ మైండేడ్ గా ఉంటె మరొకరు ఫన్నీ గా కనిపించాడు. పేకాటలో నలుగురు కింగ్స్.. ఈ ఆటలో ‘ఖిలాడి’ ఒక్కడే కింగ్ ఉంటాడు.. మెటల్ డిటెక్టర్ లాగ ఇక్కడ మనీ డిటెక్టర్ ఉంటుంది’ అనే డైలాగులు బావున్నాయి.
ఇక రెండు పాత్రల్లో మాస్ మహారాజా ఎనర్జీ అదిరిపోయింది.ముఖ్యంగా డింపుల్ , మీనాక్షి అందాలు, లిప్ లాక్ లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ట్రైలర్‌లో అనసూయకు మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆమె బ్రాహ్మణ యువతి పాత్రలో కనిపించారు. ఉన్ని ముకుందన్ ,అనసూయ ముఖేష్ రుషి వెన్నెల కిషోర్ , రావు రమేష్ లా కామెడీ హైలైట్ గా నిలవనుందని తెలుస్తోంది.
ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాఈ సినిమా ఫిబ్రవరి 11న థియేటర్లలో విడుదలవుతోంది.