telugu navyamedia
సామాజిక

రతన్ టాటా సింప్లిసిటీ కి ఫిదా అవ్వాల్సిందే..

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అతికొద్దిమంది పారిశ్రామికవేత్తల్లో రతన్ టాటా ఒకరు. ఈయన తన వ్యక్తిగత విషయాలతోపాటు, యువతకు ఉపయోగపడే అంశాలను షేర్ చేస్తుంటారు.

నిరాడంబరతకు, మానవత్వానికి పెట్టింది పేరు రతన్ టాటా. లక్షల కోట్ల రూపాయాల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయినప్పటికీ ఆయనలో కించిత్తు గర్వం కనిపించదు. తోటివారి పట్ల ఆయనెప్పుడూ దయాగుణంతో ఉంటారు. దేశానికి ఆపదొస్తే ఎంతైనా విరాళం ఇచ్చేందుకు వెనుకాడరు. అలాంటి టాటా మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు.

watch ratan tata simplicity he arrives mumbai taj hotel in nano car without bodyguards | Video: నానో కారులో తాజ్ హోటల్‌కు.. రతన్ టాటా సింప్లిసిటీ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే... సోషల్ ...

ముంబైలోని తాజ్ హోటల్లో జరిగిన ఓ కార్యక్రమానికి రతన్ టాటా నానో కారులో వచ్చారు. అది కూడా నానో కారులో ఏ బాడీ గార్డ్ సాయం లేకుండా రావడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన వచ్చిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. టాటా సింప్లిసిటీ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

గత నెలలో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నానో కార్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని మెసేజ్ ఇచ్చారు. నన్ను నిజంగా ప్రేరేపించినది, అలాంటి వాహనాన్ని తయారు చేయాలనే కోరికను రేకెత్తించింది. నిరంతరం భారతీయ కుటుంబాలను స్కూటర్‌లపై చూడటం, బహుశా తల్లి, తండ్రి మధ్య పిల్లవాడు

మరొక చిన్నారి.. నలుగురు ఆ చిన్న బండి మీద ఎలా వెళుతున్నారో అని ఆందోళన చెందాను.. వారు ఎక్కడికి వెళుతున్నారో, గతుకుల రోడ్లపై ప్రయాణించడం, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకుంటారా లేదా.. ఇవన్నీ నాలో ఆలోచనలు రేకెత్తించాయి. దాంతో వారి కోసం ఏమైనా చేయాలనుకున్నాను.

నాకు స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో ప్రవేశం ఉండటం వల్ల ఖాళీగా ఉన్నప్పుడు డ్రాయింగ్ చేస్తుండేవాడిని. మొదట నేను, నా టీమ్ అంతా కలిసి ద్విచక్ర వాహనాలను సురక్షితంగా ఎలా తయారు చేయాలా అని ఆలోచించాము.. ఆ సమయంలో నేను నాలుగు చక్రాలతో ఓ డ్రాయింగ్ గీశాను.. అయితే దానికి కిటికీలు లేవు, తలుపులు లేవు. కేవలం అది ఒక డూన్ బగ్గీ మాత్రమే. కానీ నేను చివరకు అది కారు అని నిర్ణయించుకున్నాను. అదే తరువాత నానోగా రూపాంతరం చెందింది అని అతను ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ లో రాసుకొచ్చారు.

 

Related posts