telugu navyamedia
రాశి ఫలాలు

సెప్టెంబర్ 6(సోమవారం) రాశి ఫలాలు

మేషం: ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ఉద్యోగంలో ఉన్నతికి అవకాశం. చేపట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. కొత్త కార్యక్రమాలు చేపడతారు. స్నేహితులకు సహాయపడతారు. శుభవార్తలు వింటారు.

వృషభం: ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నతికి అవకాశం. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

మిథునం: ఆర్థికంగా పర్వాలేదు. కొత్త ప్రయత్నాలు ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో ఉన్నతికి అవకాశం. వ్యాపారంలో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో సమస్యను పరిష్కరిస్తారు. మిత్రుల సహకారం ఉంటుంది. వివాదాలకు పోవద్దు.

కర్కాటకం: ఆదాయంతో పాటు ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకం ఎదురైనా పూర్తిచేస్తారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

సింహం: ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. వ్యాపారారులకు శ్రమ పెరుగుతుంది. ఉద్యోగులకు ఉన్నతికి అవకాశం. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. స్నేహితుల సహకారం తీసుకుంటారు.

కన్య: వ్యాపారులకు అనుకూలం. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతికి అవకాశం. అదనపు బాధ్యతలు ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సమస్యల పరిష్కారం అవుతాయి. వివాదాలకు అవకాశం ఇవ్వవద్దు.

తుల: ఆదాయంతో పాటు ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులకు అనుకూలం. వ్యాపారులకు మిశ్రమంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వృశ్చికం: వ్యాపారులకు అనుకూలం. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. పాత బకాయిలు వసూలవుతాయి. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

ధనుస్సు: ఆదాయం పెంచుకోవడానికి అనుకూలం. ఆరోగ్యం మెరుగవుతుంది. చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంది. కీలక సమస్యను పరిష్కరిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది.

మకరం: ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగులకు ఉన్నతికి అవకాశం. చేపట్టిన పనులన్నీ పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో చక్కని అవకాశాలు. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం.

కుంభం: ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఉద్యోగంలో సమస్యలు పరిష్కరించుకుంటారు. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు స్థానచలనానికి అవకాశం. స్నేహితులతో ఇబ్బందులు వచ్చే అవకాశం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

మీనం: వృత్తి, ఉద్యోగ, వ్యాపారారులకు అనుకూలం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.

Related posts