telugu navyamedia
రాశి ఫలాలు

సెప్టెంబర్ 23(గురువారం) రాశి ఫలాలు

మేషం : ఆర్థికంగా బాగుంటుంది. సమయం కలిసి వస్తుంది. ఖర్చులు తగ్గించుకోండి. గతంలో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. తలపెట్టిన ముఖ్యమైన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.

వృషభం : సుఖసంతోషాలతో గడుపుతారు. ఆరోగ్య౦ జాగ్రత్త. ఉద్యోగులకు, వ్యాపారులకు అనుకూలం. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. గౌరవం లభిస్తుంది.

మిథునం : సమయం అనుకూలం. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగులుకు శ్రమ ఉంటుంది. వ్యాపారంలో లాభాలు అర్జిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. అవరోధాలు, ఆటంకాలు తొలగుతాయి.

కర్కాటకం : చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగులకు సమయం అనుకూలం. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ది ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి నిపుణులు కష్టపడాల్సి ఉంది.

సింహం : ఉద్యోగంలో అధికారుల సహకారం, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారంలో, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. బాధ్యతలను సమర్ధవంతంగా పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు.

కన్య : నిరుద్యోగులకు అనుకూలం. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువులతో ఆనందంగా గడుపుతారు. పలుకుబడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

తుల : ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగులకు సమయం అనుకూలం. వ్యాపారంలో శ్రద్ధ అవసరం. సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. కుటుంబపరంగా సమన్యలున్నా ధైర్యంగా ఎదుర్కొంటారు.

వృశ్చికం : ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులు సమర్ధవంతంగా పని చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఖర్చులు తగ్గించుకోండి. మిత్రుల సహకారం లభిస్తుంది.

ధనస్సు : ఆర్థికంగా బాగుంటుంది. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారులకు అనుకూలం. అరోగ్యం జాగ్రత్త.

మకరం : ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ ఒత్తిడి ఉంటుంది. ఓ కుటుంబ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.

కుంభం : శుభవార్త వింటారు. ఆదాయం పెరిగే అవకాశం ఉ౦ది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో సత్ఫలితాలను ఇస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విజయాలు అనుభవానికి వస్తాయి.

మీనం : కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు అనుకూలం. సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.

Related posts