telugu navyamedia
రాశి ఫలాలు

సెప్టెంబర్ 10(శుక్రవారం) రాశి ఫలాలు

మేషం: సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు ఫలితం ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలకు అనుకూలం. సంకల్ప బలంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.

వృషభం: ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ధనలాభం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధి కనిపిస్తోంది. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. శుభవార్త వింటారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

మిథునం: ప్రయాణాలు అనుకూలం. ముఖ్యమైన పనుల్లో అప్రమత్తత అవసరం. కుటుంబసభ్యుల సలహాలు, సూచనలు తీసుకోండి. ఆరోగ్యం జాగ్రత్త. తగినంత విశ్రాంత అవసరం. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలం.

కర్కాటకం: ఓర్పు, నేర్పుతో ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. ఆదాయ వనరులు బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో మరింత శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. శ్రమ మీద ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి.

సింహం: నిత్యావసర వస్తు వ్యాపారులకు బాగుంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగంలో ప్రోత్సాహం లభిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు అందుకుంటారు. చాలాకాలం ఎదురు చూస్తున్న ముఖ్యమైన పని ఒకటి పూర్తవుతుంది. నిరుద్యోగులకు అనుకూలం. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది.

కన్య: వృత్తి, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. మీ ప్రతిభ వెలుగులోనికి వస్తుంది. పట్టుదలతో కొన్ని పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్థాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

తుల: ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ప్రయత్నం మీద పనులు పూర్తవుతాయి. మీకు రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్యం బాగుంటుంది.

వృశ్చికం: ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా మిత్రుల సహకారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలహాలు రాకుండా సంయమనంతో వ్యవహరించాల్సి వుంటుంది.ఆరోగ్యం జాగ్రత్త.

ధనస్సు: ఉద్యోగులకు బాగుంటుంది. వ్యాపారపరంగా అప్రమత్తంగా ఉంటే మంచిది. సమాజంలో చక్కని గుర్తింపు లభిస్తుంది. ఆదాయంలో నిలకడగా ఉంటుంది. ఆర్థిక సమస్య ఒకటి పరిష్కారమవుతుంది.

మకరం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగులకు అనుకూలం. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.

కుంభం: వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికాభివృద్ధి అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ జీవితం ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని కుటుంబ బాధ్యతలను సమర్థంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. చిరు వ్యాపారులకు కలిసిరాగలదు.

మీనం: ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆదాయం బాగుంటుంది. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతల వల్ల పనిభారం పెరుగుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం బాగుంటుంది.

Related posts