telugu navyamedia
రాశి ఫలాలు

ఆగస్టు 26 (గురువారం) రాశి ఫలాలు

మేషం: ఉద్యోగంలో ప్రమోషన్ కు అకాశం. తల పెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వ్యాపారులకు అనుకులంగా ఉంటుంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.

వృషభం: ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. స్థాన చలనానికి అవకాశం ఉంది. వ్యాపారులకు అనుకూలం. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

మిథునం: ఆర్థికంగా బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారులు ఆశించిన పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందంజ వేస్తారు.

కర్కాటకం: ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో చికాకులు తప్పవు. సహచరులతో జాగ్రత్తగా వ్యవహరించండి. వివాహ సంబంధాలకు అనుకూలం. తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. వ్యాపారులకు అనుకూలం.

సింహం: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. శుభవార్తలు వింటారు. స్నేహితుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారులకు అనుకూలం. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. రాజకీయాలు, సామాజిక సేవ, రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలం.

కన్య: ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగులకు, వృత్తి నిపుణులకు అనుకూలం. శుభవార్తలు వింటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్త. వ్యాపారులు శ్రమపడాల్సి వస్తుంది. అనవసర విషయాల్లో కాలం వృధా చేయవద్దు.

తుల: ఉద్యోగులకు, వ్యాపారులకు అనుకూలం. పాత బకాయిలు వసూలు అవుతాయి. వ్యాపారులు కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధాలకు అనుకూలం. మాట పట్టింపులకు పోవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ప్రేమ వ్యవహారాలు అనుకూలం.

వృశ్చికం: ఉద్యోగంలో ఉన్నతికి అవకాశం. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండొద్దు. ప్రేమ వ్యవహారంలో ముందడుగు వేస్తారు. వివాహ సంబంధాలకు అనుకూలం. వ్యాపారులకు లాభాలు వచ్చే అవకాశం. కుటుంబ సమస్యను పరిష్కరిస్తారు.

ధనుస్సు : ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారులు, సహోద్యోగులు సహకారం లభిస్తుంది. వివాహ సంబంధాలకు అనుకూలం.శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారంలో ముందుకెళ్తారు. వ్యాపారులకు అనుకూలం. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

మకరం: ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు, అదనపు బాధ్యతలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఇతరులకు సహాయం చేస్తారు. అనవసర ఖర్చులను తగ్గించుకోండి. వ్యాపారులకు మిశ్రమంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త తప్పనిసరి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

కుంభం: ఉద్యోగంలో ఉన్నతికి అవకాశం. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. ఎవరికీ హామీలు ఉండొద్దు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు.

మీనం: ఉద్యోగంలో ఉన్నతికి అవకాశం. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శుభవార్తలు వింటారు. వివాహ సంబంధాలకు అనుకూలం. వ్యాపారులకు లాభదాయకం. ఆశాజనకంగా సాగుతుంది. ప్రేమ వ్యవహారాలలో ఖర్చులు పెరుగుతాయి.

Related posts