telugu navyamedia
సినిమా వార్తలు

ఆ సినిమాలు చేయను… దర్శకులకు నచ్చకపోవచ్చు : రష్మిక

Rashmika

“ఛలో” సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కన్నడ భామ రష్మిక మందన్న. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న “సరిలేరు నీకెవ్వరు” సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్ రేసులో దూసుకెళ్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటివరకు రష్మిక తెలుగులో చేసిన “ఛలో”, `”గీతగోవిందం”, “డియర్ కామ్రేడ్” వంటి సినిమాల్లో ఆమెకు హీరోతో సమానమైన పాత్రలు దక్కాయి. పాటలు, గ్లామర్ షోకు మాత్రమే పరిమితమైపోకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రష్మిక.. తాను కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటానని తేల్చి చెప్పేసింది. “ఒక సినిమాకు హీరో, హీరోయిన్ ఇద్దరూ ముఖ్యమే. అలా ఉంటేనే సినిమా బాగుంటుంది. అయితే కమర్షియల్ సినిమాల్లో మాత్రం హీరోయిన్ పాత్ర బొమ్మలాగే ఉంటుంది. కమర్షియల్ చిత్రాల్లో నటించమని తమిళం నుంచి చాలా ఆఫర్లు వచ్చాయి. అయితే అలాంటి సినిమాల్లో నటించేందుకు నేను సిద్ధంగా లేను. సినిమాల సంఖ్య కంటే ఎలాంటి సినిమాల్లో నటించామనేదే నాకు ముఖ్యం. పాటల కోసమే హీరోయిన్ అనే సినిమాల్లో నేను నటించను. నేను ఇలా చెప్పడం చాలా మంది దర్శకులకు నచ్చకపోవచ్చు. నా వైపు నుంచి ఆలోచిస్తే వారికి అర్థమవుతుంది” అని రష్మిక చెప్పుకొచ్చింది.

Related posts