telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

మరో స్కాం .. రాన్‌బాక్సి మాజీ ప్రమోటర్ శివేందర్ సింగ్ అరెస్ట్ .. 740 కోట్లు స్వాహా..

ranbaxy ex promoters arrested

భారతదేశం పేదదేశమో కాదో స్కాం లను చూసి చెప్పేయొచ్చు. పేదరికాన్ని రూపుమాపడానికి ఎవరికి నిధులు కనిపించవు కానీ, స్కాం లు మాత్రం వందలు, వేలు, లక్షల కోట్లలో ఉంటున్నాయి. తాజాగా ఫార్మా దిగ్గజం రాన్‌బాక్సి మాజీ ప్రమోటర్ శివేందర్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. నిధుల దుర్వినియోగం, మోసం కేసులో శివేందర్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.740 కోట్ల లావాదేవీల్లో శివిందర్‌తో పాటు ఆయన సోదరుడు మల్విందర్ సింగ్ సైతం ఈ కేసులో ఉన్నాడు. రిలిగేర్ ఫిన్వెస్ట్ లిమిటెడ్ ఫిర్యాదు మేరకు అధికారులు చర్యలు చేపట్టారు.కాగా, ఈ నిధుల దుర్వినియోగం విషయంలో….ఆగస్టు నెలలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు శివేందర్‌, ఆయన సోదరుడు మల్విందర్ సింగ్ నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేసిన విషయం తెలిసిందే. మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు ఈ ఇద్దరు సోదరులపై దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా శివేందర్‌ను అరెస్ట్ చేశారు.

ర్యాన్‌బాక్సీ ప్రమోటర్లు మల్విందర్ మోహన్ సింగ్‌, ఆయన సోదరుడు శివిందర్ మోహన్ సింగ్‌లపై సుప్రీంకోర్టు లో జపాన్ కంపెనీ కేసు వేసింది. బకాయిలు చెల్లించడం లేదని ఈ కేసులో పేర్కొంది. దీంతో సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. జపాన్ కంపెనీ దైచీ సాంక్యోకు బకాయిలు చెల్లించకుంటే జైలు శిక్ష తప్పదని సుప్రీం చెప్పింది. అవకాశం ఇచ్చినా.. ర్యాన్‌బాక్సీ ఓనర్లు బకాయిలు ఎందుకు చెల్లించడంలేదని కోర్టు ప్రశ్నించింది. ఒకవేళ మాజీ ఓనర్లు తప్పు చేసినట్లు తేలితే, వారికి జైలు శిక్ష తప్పదని కోర్టు వార్నింగ్ ఇచ్చింది. రాన్‌బాక్సీ ఔషద కంపెనీ మాజీ డైరెక్టర్ మంజిత్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాకట్టులో ఉన్న విలువైన ఆస్తిని అమ్మిన కేసులో ఢిల్లీ పోలీసులు మంజిత్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. న్యాయస్థానం ముందు హాజరుపరచగా కోర్టు మంజిత్‌సింగ్‌కు 14 రోజుల జూడిషియల్ కస్టడీ విధించింది.

Related posts