ఈనాడు గ్రూప్ అధిపతి రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ప్రధాని మోదీ అన్నారు.
మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు రామోజీరావు అని చెప్పారు.
పాత్రికేయ, సినీరంగంపై ఆయన చెరగని ముద్ర వేశారన్నారు.
మీడియాలో రామోజీ సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారని తెలిపారు. ఆయన ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారని చెప్పారు.
ఆయనతో మాట్లాడే అవకాశం తనకు ఎన్నోసార్లు దక్కిందని గుర్తుచేసుకున్నారు.
ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు
గత పాలనలో అంతా అవినీతే.. అసెంబ్లీలో మంత్రి బొత్స