telugu navyamedia
తెలంగాణ వార్తలు

నా ఆత్మ‌హ‌త్య‌కు మొద‌ట సూత్ర‌దారి పాత్ర‌దారి అత‌నే..

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న‌ తెలంగాణ లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో మరో కీలక సెల్ఫీ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది.

బాధితుడు రామకృష్ణ ఆత్మహత్య చేసుకునే ముందు రికార్డు చేసిన మరో వీడియో తాజాగా బయటకు వచ్చింది. రాఘవతో పాటు తన తల్లి, సోదరి కారణంగా ఆస్తుల పంపకం విషయంలో ఎంతో క్షోభ అనుభవించానంటూ పలు వివరాలను ఆయన వీడియోలో చెప్పారు.

ఈ రెండో వీడియోలో ఏముందంటే..

మీరు ఈ వీడియో చూసే సమయానికి నేను బతికి ఉంటాననో లేదో తెలీదు. తన ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మైన‌ మొద‌టి సూత్రధారి పాత్ర‌దారి వ‌నమ రాఘవేనని రామకృష్ణ ఆరోపించారు. 20 ఏళ్లుగా మా అక్క కుంభ‌శోట్టి లీలా మాద‌వితో రాఘ‌వ అక్ర‌మ సంబంధం సంబంధం ఉంది. దీనికి మ‌ధ్య‌వ‌ర్తిగా స‌హాక‌రిస్తున్న మా అమ్మ‌గారు వీళ్ళ ముగ్గురు క‌లిసి నాకు నా తండ్రి ద్వారా న్యాయబద్ధంగా రావాల్సిన ఆస్తిని అడ్డుకున్నారు.

ఏడాది నుంచి వాటాలు పంచకుండా న‌న్ను అప్పులు ఊబిలోకి తోసేసి..చావు త‌ప్ప వేరే మార్గం లేకుండా ఈ ప‌రిస్థితి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.. మా సొంత స్థలం పోలవరం మండలం పాత పట్టిసీమ. మా స్వస్థలానికి ఏ సంబంధం లేని రాఘవ ఆస్తి పంపకాల విషయంలో జోక్యం చేసుకుంటున్నారు.

palvancha selfie video: 'నా భార్యను పంపమన్నాడు'.. వనమా రాఘవ బాగోతం  బయటపెట్టిన రామకృష్ణ, సెల్ఫీ వీడియో వైరల్ - palvancha family suicide case  nagaramakrishna selfie video viral | Samayam ...

అక్కకు పోలవరంలో రెండు ఎకరాలు, రాజమండ్రిలో రెండు ఇళ్ల స్థలాలు, గోకవరంలో 200 గజాల స్థలం, అమ్మ రిటైర్‌మెంట్‌ డబ్బులో కూడా వాటా ఇచ్చాం. నేను రాజమండ్రిలో అద్దె ఇల్లులో ఉంటున్నా. ఇద్దరు ఆడపిల్లలు. వారి చదువులు, కుటుంబం గడవడానికి సంపాదించుకోవాలి. సుమారు రూ.30లక్షలు అప్పులు అయ్యాయి. న్యాయం జరగదనే కుటుంబం సహా బలవన్మరణానికి పాల్పడుతున్నా. తనకు అప్పులిచ్చిన వారికి అన్యాయం చేయవద్దని వేడుకున్నారు.

కాగా..రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కు  ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేందర్ రావు ఏ-2 నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటికే పోలీసులు వనమా రాఘవను అరెస్టు చేసి కొత్తగూడెం ఏసీపీ కార్యాలయంలో విచారిస్తున్నారు.

Related posts