telugu navyamedia
సినిమా వార్తలు

టీడీపీకి అసలైన వారసుడు ఎన్టీఆర్ : ఆర్జీవీ

Ram gopal Varma Fire Censor board

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమాలో చంద్రబాబు నిజ స్వరూపాన్ని చూపించానని, రీసెర్చ్ చేసి తాను నమ్మిన విషయాలను మాత్రమే చిత్రంగా తెరకెక్కించానని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో సినిమా విడుదలను అడ్డుకున్నారన్న కారణంతో ఇప్పటికీ తన మాటల దాడి కొనసాగిస్తూనే ఉన్నాడు వర్మ. తాజాగా టీడీపీకి షాక్ ఇచ్చే ఓ ట్వీట్ చేశాడు వర్మ. ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ నిజమైన అభిమానులు ఎవరైనా “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమా చూసిన తరువాతే చంద్రబాబుకి ఓటు వేయాలని, నారా లోకేష్ టీడీపీకి నిజమైన వారసుడు కాదని, జూనియర్ ఎన్టీఆరే అసలైన వారసుడని, టీడీపీ పార్టీ భవిష్యత్తు కూడా జూనియర్ ఎన్టీఆరే అని చెప్పాడు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు వర్మ సరిగ్గా చెప్పారని, ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నామని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈరోజు ఈ సినిమా విషయమై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ మేరకు హైకోర్టు జడ్జి ఛాంబర్ లో చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఈ సినిమా చూసిన అనంతరం తుది నిర్ణయం వెల్లడించనుంది న్యాయస్థానం. సాయంత్రం వరకు సినిమాపై తుదితీర్పు వెలువడే అవకాశం ఉంది.

Related posts