telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆర్ ఆర్ ఆర్ సర్ ప్రైజ్ వీడియో… రామ్ చరణ్ బర్త్ డే కానుక

rrr

అల్లూరిని చూడని వాళ్లకు అల్లూరి అంటే ఇలాగే ఉండేవారా అన్నంతగా అద్భుతంగా చూపించారు. సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్ రోమాలు నిక్కబొడుకునేట్టు ఉన్నాయి. కీరవాణి బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సింథిల్ కుమార్ కెమెరా పనితనం వహ్ వా అనిపించేట్టుగా ఉన్నాయి. ముఖ్యంగా నా అన్న మన్నెందొర అల్లూరి సీతారామరాజు అంటూ ఎన్టీఆర్ చెప్తున్న డైలాగ్ రోమాలు నిక్కబొడుకునేట్టుగానే ఉన్నాయి. గురువారం రాత్రి 7.18 నిమిషాలౌతోంది.. ఎన్టీఆర్ ట్విట్టర్‌లో ‘సోదర రామ్ చరణ్, మంచి పరిస్థితుల్లో నీ పుట్టినరోజును జరుపుకోవాలని నేను భావించాను. కానీ, ప్రస్తుతం మనం లాక్‌డౌన్‌లో ఉన్నాం. ఎందుకంటే, ఇంటిలో ఉండటమే ఇప్పుడు ముఖ్యం. రేపు ఉదయం 10 గంటలకు నీకొక డిజిటల్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాను. నన్ను నమ్ము, ఇది నువ్వు ఎప్పటికీ మరిచిపోలేని గొప్ప అనుభూతి అవుతుంది. రామరాజు కోసం భీమ్’ అంటూ ట్వీట్ చేయడంతో ట్విట్టర్‌లో ఎన్టీఆర్ ట్వీట్ పెట్టగానే ట్విట్టర్‌లో RRR మోత మొదలైంది. ఈ సీతారామరాజుకోసం.. ఆ కొమరం భీం ఏం సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారనే ఆసక్తితో ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా? అని ఎదురు చూసిన ప్రేక్షకులు చాలా మందే ఉన్నారు. అయితే ముందుగా ప్రకటించినట్టుగా ఉదయం 10 గంటలకు టెక్నికల్ పరమైన కారణాలతో వీడియోను విడుదల చేయలేకపోయారు. దీంతో సాయంత్రం 4 గంటలకు వరకూ ఈ సర్ ప్రైజ్‌ను వాయిదా వేస్తూ ఎట్టకేలకు కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ వీడియోలో రామ్ చరణ్ నిజంగానే సర్ ప్రైజ్ చేశాడు. జక్కన్న చెక్కుతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీంగా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించబోతున్నారు. డీవీవీ దానయ్య సుమారు రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తుండగా.. ఈ చిత్రంలో కీల‌క పాత్రలో బాలీవుడ్ స్టార్ అజ‌య్ దేవ‌గ‌ణ్ న‌టిస్తున్నారు. ఎన్టీఆర్‌కు జోడీగా ఒలివియా మోరిస్‌, చ‌ర‌ణ్‌కు జంటగా బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భ‌ట్ న‌టిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి RRR (రౌద్రం రుధిరం ర‌ణం) అనే టైటిల్‌ని కన్ఫామ్ చేస్తూ ఉగాది కానుకగా మోషన్ పోస్టర్‌ని విడుదల చేశారు.

Related posts