telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ హీరో దగ్గర చెమట కంపు తట్టుకోలేకపోయా… రకుల్ సంచలన వ్యాఖ్యలు

Rakul-PReeth-Singh

టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోయిన్ల సరసన అవకాశాలు కొట్టేస్తూ స్టార్ హీరోయిన్ల రేసులో కొనసాగుతోంది పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగు, త‌మిళ, హిందీ భాష‌ల్లో వ‌రుస‌గా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంది రకుల్. సినీ రంగంలోకి ప్ర‌వేశించి ద‌శాబ్దం కావొస్తున్నా ఇప్ప‌టికీ అదే గ్లామ‌ర్‌ను మెయింటైన్ చేస్తూ అవ‌కాశాలు అందుకుంటోంది. తాజాగా మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘ఫీట్ అప్ విత్ ది స్టార్స్’ కార్యక్రమంలో రకుల్ పాల్గొంది. ఈ సందర్భంగా షూటింగ్ లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. ఓ సాంగ్లో హీరోతో రొమాన్స్ చేస్తున్నప్పుడు అతని నుంచి వచ్చే చెమట కంపు తట్టుకోలేక పోయాను అని చెప్పింది. ఆ సమయంలో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు అని చెప్పింది రకుల్. చివరికి ఆ హీరోకి చెప్పలేక… తానే ఫుల్లుగా పెర్ఫ్యూమ్ కొట్టుకున్నాను అని వెల్లడించింది. అయితే రకుల్ ని చూసి సెట్ లో ఉన్న మిగతా వాళ్ళు కూడా అదే పని చేశారట. అయితే ఈ విషయం నీకు కూడా గతంలో ఓసారి చెప్పానని రకుల్ అనడంతో మధ్యలో నన్ను లాగొద్దు అని సరదాగా విజ్ఞప్తి చేసింది మంచు లక్ష్మి. అయితే ఇప్పుడు రకుల్ చేసిన చేసిన వ్యాఖ్యలు ఏ హీరో గురించి అనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

Related posts