రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ రూపొందుతున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడింది. ఇంకా కొన్ని రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలివుంది. లాక్ డౌన్ ఎత్తేయగానే మిగతా షూటింగు మొదలుకానుంది. ఇటీవల చరణ్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని చరణ్ పాత్రను పరిచయం చేస్తూ ఒక స్పెషల్ వీడియోను వదిలారు. ఆ వీడియోకు అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి రోజుకొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తాజాగా ఈ భారీ బడ్జెట్ చిత్రంలో రకుల్ స్పెషల్ డ్యాన్స్ చేయనుందని అంటున్నారు. రామ్ చరణ్ సరసన రకుల్ ధృవ మరియు బ్రూస్ లీ చిత్రాలలో నటించింది. ఇందులో రకుల్ పర్‌ఫార్మెన్స్‌కి ఫిదా అయిన చెర్రీ “ఆర్ఆర్ఆర్”లో స్పెషల్ డ్యాన్స్‌ని రకుల్‌తో చేయించాలని భావించి రాజమౌళికి సిఫారసు చేశాడట. ఈ వార్తలో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది.
previous post
next post
“అరే పవన్” అంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు