telugu navyamedia
సినిమా వార్తలు

“రాజ్ దూత్” ఫస్ట్ లుక్

Rajdooth

శ్రీహరి తనయుడు మేఘాంశ్ పరిచయం అవుతున్న సినిమా ‘రాజ్‌దూత్’. శ్రీహరి నటించిన ‘భైరవ’ చిత్రంలో మేఘాంశ్ బాలనటుడిగా కనిపించారు. చదువు పూర్తి కావడంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవల ఈ చిత్రంలోని ప్రీ లుక్‌ను విడుదల చేశారు. తాజాగా ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్‌లో బైక్ పక్కన నిలబడి చూస్తున్న మేఘాంశ్ తన లుక్ తో అదరగొడుతున్నారు. కాగా ఈ ‘రాజ్‌దూత్’ చిత్రాన్ని లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సత్యనారాయణ నిర్మిస్తున్నారు. కార్తీక్-అర్జున్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts