telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ : ఆ టైటిల్ కే జక్కన్న ఫిక్స్…?

RRR

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. అయితే ఆర్ఆర్ఆర్ ఫుల్ ఫామ్ ఏంటనేది మాత్రం ఫ్యాన్స్‌కి చిక్కు ప్రశ్నగా మారింది. పాన్ ఇండియా మూవీగా అన్ని భాషల్లోనూ పెద్ద ఎత్తున రిలీజ్ కాబోతుంది కాబట్టి.. అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటే బెటర్ అని రాజమౌళి ఆలోస్తున్నారట. దీంతో లెక్కలేనన్ని టైటిల్స్‌ని చెక్ చేశారు. వాటిన్నింటిలోకల్లా.. ఒక టైటిల్‌ను రాజమౌళి ఫైనల్ చేశారని సమాచారం. అదే అందరికీ నచ్చిందంట. ఇంతకీ ఆ టైటిల్ ఏంటని అనుకుంటున్నారా.. ‘రఘుపతి రాఘవ రాజారాం’. కాగా రఘుపతి రాఘవ రాజారం అనేది ఓ భక్తి గీతం. ఇదంటే మహాత్మా గాంధీజీకి ప్రాణం. అప్పట్లో చాలా సభల్లో ఆయన పాడారు కూడా. అందులోనూ RRR సినిమా ఫ్రీడమ్ ఫైటర్స్‌కి సంబంధించింది కాబట్టి.. ఇది అయితే కరెక్ట్‌గా ఉంటుందని రాజమౌళి అభిప్రాయపడుతున్నారట. అయితే.. ఈ టైటిల్‌ను ఖరారు చేయడంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంటుంది.

Related posts