హీరో రాజ్ తరుణ్ నటించిన చిత్రం ‘అనుభవించు రాజా’. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాకు గవిరెడ్డి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కింగ్ అక్కినేని నాగార్జున విడుదల చేసి చిత్ర బృందానికి ఆల్‌ద బెస్ట్ చెప్పారు.
ఫస్ట్ లుక్ పోస్టర్ లో పందెం రాయుడిగా కనిపిస్తున్న రాజ్ తరుణ్.. మెడలో బంగారపు చైన్లు, చేతికి ఉంగరాలు మరియు బ్రాస్ లెట్ ధరించి ఉన్నాడు. నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని పందెం కోడిని నెమరుతూ ఉల్లాసంగా కనిపిస్తాడు. ఈ మూవీలో కాశిష్ ఖాన్ హీరోయిన్. సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం ప్రముఖ నటీనటులు టెక్నీషియన్లు వర్క్ చేస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి గేయ రచయిత భాస్కరభట్ల సాహిత్యం అందిస్తున్నారు.
గామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి, ఆడుకాలమ్ నరేన్, అజయ్, సుదర్శన్, టెంపర్ వంశీ, ఆదర్శ్ బాలకృష్ణ, రవి కృష్ణ, అరియానా తదితరులు నటిస్తున్నారు. ‘ఉయ్యాల జంపాల’ ‘రంగులరాట్నం’ సినిమాల తర్వాత రాజ్ తరుణ్‌తో అన్నపూర్ణ స్టూడియోస్ మూడో చిత్రం ఇది.
Happy to show you the first Look of our next !! @itsRajTarun#AnubhavinchuRaja @AnnapurnaStdios @SVCLLP @itsRajTarun @GavireddySreenu @adityamusic pic.twitter.com/RVOgI4aBRq
— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 28, 2021
విశ్వం మా ఇద్దరినీ ఒకే చోట చేర్చింది… లాక్ డౌన్ అనుభవాన్ని షేర్ చేసిన రకుల్