telugu navyamedia
సినిమా వార్తలు

పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రాకు ఊరట..

పోర్నోగ్రఫీ కేసులో అరెస్టన బాలీవుడ్ సుంద‌రి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు ఎట్ట‌కేల‌కు బెయిల్ దొరికింది. ముంబై మెట్రోపాలిటన్ కోర్టు కుంద్రాకు బెయిల్ మంజూరు చేసింది. ఇందుకోసం రూ.50వేలు పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. కుంద్రాతోపాటు మరో నిందితుడు రయన్ తోర్పేకూ ముంబయి కోర్టు బెయిల్ ఇచ్చింది.

Shilpa Shetty Hinting At Divorce With Raj Kundra Post P*rn Case? Talks  About A "Brand New Ending"

సినిమా అవకాశాల కోసం ముంబైకి వచ్చిన యువతులను నమ్మించి పోర్న్ సినిమాల్లో నటించేలా ఒత్తిడి చేశాడన్న ఆరోపణలతో జులై 19న రాజ్‌కుంద్రాను అరెస్ట్‌ చేశారు.. రెండు నెలల క్రితం ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు అప్పటి నుంచి కోర్టు ముందు హాజరు పరిచి కస్టడీకి తరలించారు.

Will Shilpa Shetty give divorce to husband Raj Kundra, Big hint given on  social media | Shilpa Shetty ने लिया Raj Kundra से डिवोर्स का फैसला? सोशल  मीडिया पर दिया बड़ा हिंट |

ఈ కేసులో విచారణ ముగిసిన కారణంగా తనకు బెయిల్ ఇవ్వాలని రాజ్ కుంద్రా ముంబై మెట్రోపాలిటన్ కోర్టును ఆశ్రయించారు. తనను తప్పుడు కేసులో ఇరికించారని, ఎఫ్ఐఆర్ లో తన పేరు లేకపోయినా కేసులోకి లాగారని పోలీసులపై రాజ్ కుంద్రా ఆరోపణలు చేశారు. కాగా.. బెయిల్ కోసం కుంద్రా వేసిన పిటిషన్ పై ముంబై న్యాయస్థానం విచారణ జరిపి బెయిల్ మంజూరు చేసింది.

Related posts