andhra

ఆంధ్రాలో అల్లకల్లోలంగా సముద్రం

14

రానున్న 4 రోజులపాటు తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ ఒడిశా నుంచి ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి, ఒడిశా నుంచి కోస్తా ఆంధ్రా, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన శ్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

ఒకవైపు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అలలు తీరం వెంబడి 10 నుండి 15 అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడుతున్నాయి. 50 నుంచి 60 అడుగుల వరకు సముద్రం ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో చేపల వేటకు మత్స్యకారులు వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ అధికారులు.

మరోవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఇన్ ఫ్లో 13,690 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు ఉంది. ప్రస్తుతం నీటిమట్టం 1053.90 అడుగులకు చేరింది.