telugu navyamedia
రాజకీయ

రక్షా బంధన్ సందర్భంగా ఉద్వేగానికి గురైన రాహుల్ గాంధీ

రక్షా బంధన్ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన తన సోదరితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రక్షా బంధన్ సందర్భంగా తన చిన్న నాటి స్మృతులను రాహుల్ గాంధీ గుర్తు చేసుకున్నారు.

 సోద‌రి ప్రేమ , ఆప్యాయ‌త‌ల‌కు నా జీవితంలో ప్ర‌త్యేక స్థానం ఉంది. మేమిద్ద‌రం మంచి స్నేహితులం.. చిన్న నాటి నుంచే ఇద్దరం ఒకరికి ఒకరు తోడుగా నిలిచామని, కష్టసుఖాల్లో అండగా ఉన్నామని పేర్కొన్నారు. తమ బంధం శాశ్వతమని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ర‌క్షా బంధ‌న్ పండ‌గ సంద‌ర్భంగా అంద‌రికీ హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు అని రాహుల్ పోస్ట్ చేశారు.

కాగా అన్నాచెెల్లెళ్ల అనుబంధంగా నిలిచే రక్షాబంధన్ వేడుకను దేశ వ్యాప్తంగా అందరూ జరుపుకుంటున్న సంగతి తెెలిసిందే. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో తమ చిన్ననాటి ఫొటోలను కూడా షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఇది నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది.

Related posts