Rahul Gandhi To Appear In Court Today In Maharashtra

పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్ 

18
రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆరెస్సెస్‌) కార్యకర్త వేసిన పరువునష్టం కేసులో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మంగళవారం మహారాష్ట్రలోని భీవండి కోర్టులో హాజరయ్యారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలోమహాత్మ గాంధీ హత్యతో, ఆరెస్సెస్‌  సంబంధం ఉందంటూ రాహుల్‌ వ్యాఖ్యానించారని ఆరోపిస్తూ అప్పట్లో రాహుల్‌పై పరువు నష్టం కేసు నమోదైంది. స్థానిక ఆరెస్సెస్‌ కార్యకర్త  రాజేశ్‌ కుంతే  ఫిర్యాదు మేరకు అప్పట్లో ఈ కేసు ఫైల్‌ చేశారు. 
 
భీవండి కోర్టుకు హాజరైందుకు ఈ రోజు ఉదయం ముంబై విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌కు కాంగ్రెస్‌ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.  గత నాలుగు  సంవత్సరాలుగా  కొనసాగుతున్న ఈ కేసులో రాహుల్‌ను జూన్‌ 12వ తేదీన  హాజరవ్వల్సిందిగా కోర్టు పేర్కొంది.  తొలుత ఈ కేసుపై వెనుకంజ వేసినట్టు కనిపించిన రాహుల్‌ తర్వాత కేసును ఎదుర్కొనేందుకు సిద్ధపడ్డారు.