telugu navyamedia
రాజకీయ

ఖాట్మాండు నైట్ క్ల‌బ్‌లో రాహుల్‌ గాంధీ ..వీడియో వైర‌ల్

*ఖాట్మాండు నైట్ క్ల‌బ్‌లో రాహుల్‌గాంధీ..
*క‌ష్టాల్లో ఉన్న  పార్టీని వ‌దిలేసి ఫారిన్ పార్టీలు అంటూ విమ‌ర్శ‌లు..

నేపాల్‌ రాజధాని ఖాట్మాండులోని ఓ నైట్‌ క్లబ్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీకి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో తీవ్ర దుమారం రేపుతోంది.

 నేపాల్ కాఠ్​మాండూలోని లార్డ్ ఆఫ్ రింగ్స్ క్లబ్​లో రాహుల్ కనిపించారుడిస్కో లైట్ల మధ్య చుట్టూ స్నేహితులతో ఆయన కనిపించారు.

ఈ వీడియో ఆధారంగా రాహుల్‌పై బీజేపీ విరుచుకుపడుతోంది. వ్యక్తిగత టూర్‌ అయినప్పటికీ.. వివాదాస్పదమైన అంశాలను ప్రస్తావిస్తున్నారు బీజేపీ నేతలు.

Thumbnail image

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో మతఘర్షణలు జరుగుతుంటే రాహుల్ గాంధీ ఎంచక్కా పార్టీ చేసుకుంటున్నారని విమర్శలు సంధించారు. కష్టాల్లో ఉన్న పార్టీని వదిలి విదేశాల్లో పార్టీ చేసుకుంటున్నారని అని విమ‌ర్శ‌లు వెల్లు వెత్తున్నాయి.

కాగా ఈ  వీడియోలో.. రాహుల్‌ గాంధీ ఓ మహిళతో క్లోజ్‌గా మరింత చర్చనీయాంశంగా మారింది. ఆమె నేపాల్‌లో చైనా దౌత్యవేత్త అయిన హౌ యాంకీ అని ప్రచారం జరుగుతోంది.

రాహుల్‌ వివాహానికి హాజరయ్యేందుకు ఆయన నేపాల్ వెళ్లారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. మయన్మార్‌లో నేపాల్‌ రాయబారిగా పనిచేసిన భీమ్‌ ఉదాస్‌ కుమార్తె వివాహానికి రాహుల్ గాంధీ హాజరయ్యారని చెబుతున్నారు. ఉదాస్ కుమార్తె సుమ్నిమా గతంలో సీఎన్ఎన్ వార్తా సంస్థకు ప్రతినిధిగా పని చేశారు.

Related posts