ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీతో పాటు, కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానానికి పోటీ చేయాలని నిర్ణయించుకున్న ఆయన… ఇవాళ వాయనాడ్‌లో ఉదయం 11 గంటలకు రాహుల్ నామినేషన్ దాఖలు చేస్తారు.
రాహుల్ గాంధీ నామినేషన్ కార్యక్రమానికి ఆయన సోదరి, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కూడా హాజరుకానున్నారు. రాహుల్ గాంధీ నామినేషన్ సందర్భంగా రోడ్ షోకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి.
జేడీఎస్ కార్యకర్తలంతా వ్యభిచారులే: సిద్ధరామయ్య