telugu navyamedia
రాజకీయ వార్తలు

ఎస్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు.. స్పందించిన రాహుల్

rahul gandhi to ap on 31st

ఎస్ బ్యాంకుపై భారతీయ రిజర్వు బ్యాంకు ఆంక్షలు విధించింది. దీంతో ఆ బ్యాంకు ఖాతాదారులు ఆందోళనకు గురవుయతున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ స్పందించారు. ఇది ఎస్‌ బ్యాంక్‌ వైఫల్యం కాదని పూర్తిగా ఆర్థిక వ్యవస్థ నియంత్రణ వైఫల్యం కనపడుతోందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విధానాలే భారతీయ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. .

బీజేపీ ఆరేళ్లుగా అధికారంలో ఉందని, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో జరిగిన పరిణామాల వల్ల ఇప్పటికే బీజేపీ పరిపాలన, ఆర్థిక సంస్థల నియంత్రణలో వైఫల్యాలు బయటపడ్డాయని కాంగ్రెస్ నేత చిదంబరం అన్నారు. ముందుముందు ఇంకా ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ డిపాజిటర్ల మాదిగానే ఎస్‌ బ్యాంకు ఖాతాదారులు కూడా ఆందోళనకు గురవుతున్నారని చిదంబరం చెప్పారు.

Related posts