telugu navyamedia
రాజకీయ

హ్యాపీ బర్త్ డే.. మోడీజీ : రాహుల్

అధికారంలో వున్నా , ప్రతిపక్షంలో వున్నా నాయకులు పుట్టినరోజు సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం ఆరోగ్యకరమైన సంప్రదాయం . సహజంగా రాజకీయాలు పక్కన పెట్టి ఆత్మీయంగా గ్రీట్ చేస్తారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో వుంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో వుంది. అటు పార్లమెంట్ లోను ,ఇటు రాజ్య సభలోను ఈ రెండు పార్టీలు విమర్శలు చేసుకుంటూ ప్రత్యర్థుల్లా కనిపిస్తారు. అధికార పార్టీ చేసే నిర్ణయాలపై కాంగ్రెస్ పార్టీ కూడా ధ్వజం ఎత్తుతుంది.

అయితే ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ 71వ జన్మదినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ” హ్యాపీ బర్త్ డే , మోడీజీ ” అంటూ ట్వీట్ చేశారు . అది మంచి సంప్రదాయం.

Related posts