telugu navyamedia
Uncategorized

అనిల్ అంబానీకి రూ. 30 వేల కోట్లను దోచి పెట్టారు: రాహుల్ 

Rahul support to Govt. terrarists attack
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి ద్వజమెత్తారు. దేశ భద్రత, రాఫెల్‌ కుంభకోణం పై చర్చ అంటే ఆయన పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. రాఫెల్ డీల్‌పై మీడియాతో  ఆయన మాట్లాడుతూ..అనిల్ అంబానీకి రూ. 30 వేల కోట్లను దోచిపెట్టారని ఆయన ఆరోపించారు. కేవలం  అంబానీకి లబ్ధి చేకూర్చేందుకే ఫ్రాన్స్ ప్రభుత్వంతో ప్రధాని కార్యాలయం చర్చలు జరిపిందని చెప్పారు. రాఫెల్ కుంభకోణంలో మోదీ పాత్ర ఉందని పేర్కొన్నారు
మోడీ కాపలాదారుడే కాదు దొంగ కూడా అని వ్యాఖ్యానించారు. ఉన్నతస్థాయి కమిటీ చర్చలు జరుపుతున్నప్పుడు పీఎంవో జోక్యమేంటని రాహుల్ ప్రశ్నించారు. 2017 నాటి రక్షణ శాఖ నోట్‌ను రాహుల్ ప్రస్తావిస్తూ..రక్షణ శాఖ వ్యతిరేకించినా ఎందుకు ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. ప్రధానితో పాటు రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. రాఫెల్‌పై విచారణ చేపట్టాలని రాహుల్  డిమాండ్ చేశారు.

Related posts