telugu navyamedia
రాజకీయ వార్తలు

ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు పై స్పందించిన రాహుల్

rahul gandhi to ap on 31st

జ‌మ్మూక‌శ్మీర్‌ కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. జ‌మ్మూక‌శ్మీర్‌కు ఉన్న ప్ర‌త్యేక హోదాను ర‌ద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాన్ని రాహుల్ త‌ప్పుప‌ట్టారు. ఈ చ‌ర్య‌ ద్వారా జాతీయ భ‌ద్ర‌త‌కు పెను ప్ర‌మాదం ఏర్ప‌డుతుంద‌ని అన్నారు.

జ‌మ్మూక‌శ్మీర్‌ను ఏకప‌క్షంగా విభ‌జించి జాతీయ స‌మ‌గ్ర‌త‌ను కాపాడ‌లేర‌న్నారు. ఎన్నికైన ప్ర‌జాప్ర‌తినిధుల‌ను అరెస్టు చేసి, రాజ్యాంగాన్ని ఉల్లంఘించ‌డం స‌రికాద‌న్నారు. ప్ర‌జ‌ల‌తో దేశం నిర్మిత‌మై ఉంద‌ని, కేవ‌లం భూమి ముక్క‌లు కాద‌ని అన్నారు. ప్ర‌త్యేక అధికారాల‌ను నిర్వీర్యం చేయ‌డం వ‌ల్ల జాతీయ భ‌ద్ర‌త‌కు పెను స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయ‌ని రాహుల్ గాంధీ తెలిపారు.

Related posts