telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీ శాసనమండలి రద్దు చేయాలి

ycp Raghurama krisharaju

ఏపీ శాసనమండలి రద్దు ప్రక్రియను వెంటనే చేపట్టాలని కేంద్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల మంత్రులు రవిశంకర్‌ ప్రసాద్‌, ప్రహ్లాద్‌ జోషికి ఎంపీ రఘురామకృష్ణ రాజు లేఖ రాశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల దృష్ట్యా లేఖ రాస్తున్నట్లు చెప్పారు. 2020 జనవరి 27న అసెంబ్లీలో మండలి రద్దుకు తీర్మానం చేసినట్లు లేఖలో చెప్పారు. మండలి రద్దుకు ఎంపీలు కృషి చేయాలంటూ 2020 సెప్టెంబర్‌ 14న సీఎం జగన్‌ ఆదేశించినట్లు చెప్పారు. సీఎం, పార్టీ అధ్యక్షుడి ఆదేశాలను పాటించేలా ఏపీమండలి రద్దు చేయాలని, ఈ అంశంపై వర్షాకాల సమావేశాల్లో తీర్మానం పెట్టాలని రఘురామ లేఖలో కోరారు. అయితే సీఎం జగన్ కంపెనీపై ఏపీ హైకోర్టులో ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీకి మైనింగ్‌ లీజు పొడిగింపుని సవాల్‌ చేస్తూ ఏపీ హైకోర్టులో రఘురామ పిటిషన్‌ వేశారు. మైనింగ్ లీజ్‌లో అక్రమాలు జరిగాయని సీబీఐ నిర్ధారించిందన్నారు. సీబీఐ కేసు దాఖలు చేసిన కంపెనీకి లీజు ఎలా పొడిగిస్తారని రఘురామ ఆ పిటీషన్‌లో ప్రశ్నించారు. జగన్ సొంత కంపెనీ కావటంతో అధికారులు నిబంధనలు ఉల్లఘించి అనుమతులు ఇచ్చారని పిటిషన్‌లో రఘురామ చెప్పారు. సరస్వతి కంపెనీ, పరిశ్రమలశాఖ, మైనింగ్ శాఖ, ఏపీ పొల్యూషన్ బోర్డులను ప్రతివాదులుగా రఘురామ కృష్ణరాజు చేర్చారు.

Related posts