telugu navyamedia
క్రీడలు వార్తలు

రఫెల్ నాదల్ మరో రికార్డు..

ప్రపంచంలోని ప్రసిద్ద క్రీడల్లో ఒకటి టెన్నిస్. అందులో మొత్తం 1000 విజయాలు సాధించిన ఆటగాళ్లకు ప్రత్యేకత ఉంటుంది. అందులో ఇప్పడు స్పానిష్‌ ఆటగాడు రఫెల్ నాదల్ కూడా చేరాడు. అయితే ఓపెన్ ఎరా సింగల్స్‌లో ఈ ఘనత సాధించాడు. అయితే ఈ ఘనతను ఫెలిసియానో లోపెజ్‌పూ 4-6, 7-6(5), 6-4తో గెలిచి సాధించాడు. ఈ విజయాలను ప్యారిస్‌లో జరుగుతున్న ప్యారిస్ మాస్టర్స్‌ కాంపిటీషన్‌లో చేశాడు. ఇప్పటి వరకు జిమ్మీ కానర్స్ 1,274 విజయాలు, రోజర్ ఫెదరర్ 1,242 విజయాలు, ఇవాన్ లెండి 1,068తో ఉండగా ఇప్పుడు నాదెల్ వీరి సరసన చేరాడు.

అయితే 34 ఏళ్ల ఈ టెన్నిస్ ఆటగాడు ఇన్ని విజయాలు సాధించానంటే తాను ముసలి వాడనవుతున్నట్లు అని అన్నాడు. ‘ఈ ఘనత నాకు చాలా గొప్పది. నేను ఈ ఘనత సాధించనంటే నేను ముసలి వాడినవుతున్నాట్లే, అంటే నాను ఇన్నేళ్లుగా రాణింస్తున్నాను, ఇంతబాగా ఆడటానికి ఎంతో సమయం పట్టింది. ఇందుకు నేను కేవలం థాంక్స్‌ చెప్పి ఆపుకోలేను, ఇది నాకు చాలా గొప్ప విజయం. నేను ఇక్కడిదాకా చేరడానికి నాకు తోడుగా ఉన్న ప్రతిఒక్కరి విజయం ఇది. నాకు చాలా ఆనందంగా ఉంద’ని అన్నాడు. అంతేకాకుండా ‘ఇది నాకు చాలా ప్రత్యేకం. ఈ నెంబర్ ఎంతో స్పెషల్, దీన్ని పంచుకునేందుకు జనాలు లేకపోయినా నాకు ఇది చెప్పలేనంత ప్రత్యేకం’ అన్న నాదల్ మాటలను ప్యారిస్ మాస్టర్స్ అధికారిక విబ్ సైట్ ప్రచురించింది. అయితే ఎవరూ ఓటమిని అంగీకరించొద్దనీ, తాను ఓ బాల్ బాయ్‌గానే తన టెన్నిస్ జీవితానని ఆరంభించానని నాదెల్ వివరించాడు.

Related posts