telugu navyamedia
సినిమా వార్తలు

‘రాధేశ్యామ్’లో పరమహంసగా రెబల్ స్టార్..

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న పీరియాడిక్ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ డ్రామా రాధే శ్యామ్. ప్యారిస్‌ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగే ఈ రొమాంటిక్‌ ప్రేమకథలో పూజా హెగ్డే ప్రేరణగా కనిపించనుంది.

Prabhas' 'Radhe Shyam' pre-release event to be held on Dec 23

ఇటీవ‌ల విడుద‌లైన మూవీ పోస్ట‌ర్స్‌, వీడియో లు, సాంగ్స్ అభిమానుల‌కు ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతోంది. ఈ నేప‌థ్యంలో ప్రమోషన్స్‌ జోరు పెంచింది చిత్ర‌యూనిట్‌.

Prabhas's pic from Radhe Shyam sets with uncle Krishnam Raju wins the  internet - Movies News

తాజాగా ఈ చిత్రం నుండి ఒక పోస్టర్ ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. పరమహంస పాత్రలో కృష్ణంరాజు నటిస్తున్నట్లు పోస్టర్‌ ద్వారా అధికారికంగా వెల్లడించింది. ఈ పోస్టర్ లో కృష్ణంరాజు కాషాయ వస్త్రాలు ధరించి స్వామీజీలా ఆకట్టుకుంటున్నారు.

Radhe Shyam Satellite Rights Has Gone For A Whopping Price!!!

ఈ సినిమాను టీ సిరీస్ ఫిల్మ్స్ మరియు యూ వీ క్రియేషన్స్ పతాకంపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ తెలుగు వెర్షన్ కి సంగీతం అందిస్తున్నారు. కాగా.. కృష్టం రాజు ప్రభాస్‌తో కలిసి ‘బిల్లా’, ‘రెబల్’‌ సినిమాల్లో కలిసి నటించారు. ఇన్నేళ్ల గ్యాప్‌ తర్వాత రాధేశ్యామ్‌లో మ‌ళ్ళీ నటిస్తున్నారు.

Radhe Shyam: ప్రభాస్‌ 'రాధేశ్యామ్' నుంచి మరో సర్‌ప్రైజ్‌..! - telugu news  soch liya song from radhe shyam starring prabhas pooja hegde

Related posts