telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

కళ్ళను కమ్మేసిన మాయదారి విధి ..

కళ్ళను కమ్మేసిన మాయదారి విధి ..
ఒళ్ళును మరపింపచేసిన కుటిల నిశీధి ..
మతిని బ్రమింపచేసిన మూఢత్వం ..
కన్న ప్రేగునే కడదేర్చిన అంధత్వం ..
దైవం తామేనంటు .. దైవత్వం తమదేనంటు
చెప్పుకుంటూ .. కన్నబిడ్డలనే అంతమొందించిన పిచ్చితనం
కన్న పిల్లల్ని తల్లే చంపే కలికాలపు అమ్మతనం
బంగారు భవిష్యత్తుకు బాటలు కాస్త బలి కోరాయేమో …
భవితవ్యం లేనిదంటూ అమ్మతనం ఆ యువకిరణాలను మూఢనమ్మకాల పేరుతో గ్రహణంలా కమ్మేసిందేమో …
వెర్రితనమో .., పిచ్చితనమో
మానసిక రోగమో .. మాయదారి మూఢనమ్మకమో
రెండు నిండు ప్రాణాలు బలిగొంది
రెండు నిండు జీవితాలను నాశనం చేసింది
కాలం చెల్లిన మూఢత్వానికి చెప్పండి ఇకనైనా స్వస్తి..
ఆధునిక కాలం లో విజ్ఞానమే దేవుడు మనకిచ్చిన ఆస్తి ..

Related posts