telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

రంగు…రంగుల హోలీ పండుగ

రంగులు …కనులకు విందులు
మనసును రంజింప చేసే పసందులు
ప్రకృతిలో ఎన్ని సుందర రంగుల హంగులు
ఆ రంగుల్లో ఎన్ని సొగసుల మేళవింపులు
రంగుల రమ్యత ఇస్తుంది పులకింత
వాటి ఆధిక్యత మనకు గొప్ప తుళ్ళింత
“హరివిల్లు “కి అందం రంగుల సొబగులే
పురివిప్పిన నెమలి అందం ఆ నీలిమే
ఆకసాన సూర్యోదయం, సూర్యాస్తమయం
ఎన్నో రంగుల్లో ప్రస్ఫూట మయే రామణీయం ,
హరివిల్లు రంగుల సౌజన్యం ఆ నింగిపై పరమాద్భుతం
ఎన్ని సార్లు చూసినా …తనివి తీరని మనోహరం
ఎంత మహత్తరం ….. కనులు తిప్పలేని లేని కమనీయం
చందమామ రజిత కాంతుల వెన్నెల ..ఏమి సోయగం
నల్లని నింగి లో రాత్రి… తారకలు
మణులై యెంత సుందరం
ఋతు రాగాల కనుగుణంగా రంగుల్లో శోభాయమానమై
తనని తా నే అలంకరించుకుని ప్రకృతి …. ముచ్చట
గొలిపే సుందర వైనం
మనచుట్టూ పూవులు, పండ్లు, చెట్లు,,కాయలు
పిట్టలు, జంతువులూ పురుగులు ,..మనుషులూ
సముద్రం, కొండలు ,మబ్బులు, .వృక్షాలు, చీకటి, వెల్తురూ
ఈ అన్నిటిలో యెంత అసమాన రంగుల అద్భుత వైవిధ్యం
ఎంతటి మహత్తర సౌందర్య అపురూపం ,ఆహ్లాదం,అద్భుతం
ఇన్ని రంగుల్లో సృష్టి అందంగా
చిత్రించి ఓ అ పూ ర్వం
అనన్యం చేసి ..మనకు అందించిన
ఆ దైవానికి
ప్రేమాభి వందనం ….రంగుల పువ్వులతో అభి వందనం

Related posts