telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

నిరంతరం నిరీక్షణలో

ఆశయం గొప్పదైతే
ఆలోచన నీగమ్యాన్ని చేరుస్తుంది
కలలు కంటే సరిపోదు
కష్టపడితే చేరగలవు వూహలు
కాదు వాస్తవాలుగా మార్చు
నీవే బ్రహ్మ అవుతావు
నిరంతరం నిరీక్షణలో
నీవు అగ్నిలా మండుతుంటే జాతికి
వెలుగునిచ్చే దీపంకాదా నీవు
పరులకొరకు పాటుపడే
ఓ హృదయమా మానవరూపంలో
దివికొచ్చిన దేవుడివా
ఏమనిపొగడాలి నిన్ను
సాటి మనిషిగా ఓనేస్తమా నీవే
నవ చైతన్యం కావాలి సమాజానికి
……………………………………………
చైతన్యమై చేరగలవా ఆనందమై అందుకోగలవా
కలవై కనిపించగలవా స్నేహమై చేరువవుతవా
అభిమానమై హక్కున చేర్చుకుంటావా
ప్రేమై అల్లుకు పోతావా ప్రియతమా నీవెక్కడ…?
నా వూహకందని ఓ వరమా అందని జాబిలి నీవై
నను చూస్తువుంటావా అర్ధరాత్రివరకు నిద్రపోని
నా కనులకి కనిపించే ఆకశంలో వున్న ఓ చందమామ
ఎలా చేరగలను నిన్ను

Related posts