telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

జ్ఞాపకాలు

కొన్ని జ్ఞాపకాలు నులివెచ్చని రవికిరణాలు..!!

కొన్ని జ్ఞాపకాలు మాలయ మారుతపు మంచు బిందువులు…!!

కొన్ని జ్ఞాపకాలు శ్రీగంధపు పూతల చల్లదనాలు…!!

కొన్ని జ్ఞాపకాలు మరుమల్లెల మధుర పరిమళాలు…!!

కొన్ని జ్ఞాపకాలు హృదయలయల ఉద్వేగ భరితాలు…!!

కొన్ని జ్ఞాపకాలు చిరకాలపు గాయాల హృదయ విషాదాలు…!!

కొన్ని జ్ఞాపకాలు వాడిపోని పచ్చని ప్రకృతి హరితాలు…!!

కొన్ని జ్ఞాపకాలు మదిని గుచ్చుకునే పదునైన శరాలు…!!

కొన్ని జ్ఞాపకాలు సరిగమల హృదయ లయల సవ్వడులు…!!

కొన్ని జ్ఞాపకాలు ఉచ్ఛ్వాస నిశ్వాసలై ఊపిరితో ఊగే ఆశల ఊయలలు…!!

కొన్ని జ్ఞాపకాలు వెన్నెల జలపాతపు వెండి సోయగాలు…!!

కొన్ని జ్ఞాపకాలు మరచిపోలేని మరపురాని నిత్య వ్యాపకాలు…!!

కొన్ని జ్ఞాపకాలు నాలుగు కాలాలలోనూ కవ్విస్తూ నిలిచే నిత్య వసంతాలు…!!

కొన్ని జ్ఞాపకాలు కలలో సైతం వెంటాడే నీలినీడల పీడకలలు…!!

కొన్ని జ్ఞాపకాలు నిత్య జీవిత వెలుగునీడల క్రినీడలు…!!

కొన్ని జ్ఞాపకాలు హరివిల్లులో విరిసిన అపురూప వర్ణాల రంగవల్లికలు…!!

కొన్ని జ్ఞాపకాలు అలసిన మనసుకు ఆనందాల చిరుజల్లులు…!!

కొన్ని జ్ఞాపకాలు పెదవులపై విరిసే చిరునవ్వుల దొంతరలు…!!

కొన్ని జ్ఞాపకాలు తీయని పాల మీగడ తరకల తీపి గుర్తులు…!!

కొన్ని జ్ఞాపకాలు కనుల పొరలలోని కన్నీటికి చిరునామాలు…!!

కొన్ని జ్ఞాపకాలు కాలే చితిమంటల స్మశాన వైరాగ్యాలు…!!

కొన్ని జ్ఞాపకాలు పెదవంచున ఒలికే చిరునవ్వుల సోయగాలు…!!

కొన్ని జ్ఞాపకాలు ఎన్నటికీ ఎప్పటికి దాచుకునే అణిముత్యాలు……!!

Related posts