telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అయోధ్య తీర్పు రాసింది ఎవరో .. సంప్రదాయం పక్కనపెట్టేశారే ..

ayodya case hearing will end tomorrow

ఇప్పటివరకు ఏ తీర్పు వెలువడినా ధర్మాసనం తరఫున ఆ తీర్పును రాసిన న్యాయమూర్తి ఎవరో కూడా ప్రకటిస్తారు. ఒకరికి మించిన న్యాయమూర్తులు సభ్యులుగా ఉన్న ధర్మాసనాలు తీర్పు ఇచ్చే సమయంలో తీర్పును రాసిన జడ్జీ పేరును ప్రకటించడం సంప్రదాయం. కానీ అయోధ్య తీర్పు విషయంలో ఈ సంప్రదాయాన్ని పాటించకపోవడం విశేషం. అయోధ్య కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలో జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ అశోక్‌భూషణ్, జస్టిస్‌ ఎస్‌ఏ నజీర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సభ్యులుగా ఉన్న ధర్మాసనం విచారించింది.

కోర్టుహాల్లో 1045 పేజీలున్న తుది తీర్పులోని కీలక అంశాలను జస్టిస్‌ గొగోయ్‌ చదివి వినిపించారు. తీర్పుతో పాటు 116 పేజీల అనుబంధాన్ని కూడా ప్రత్యేకంగా ఇవ్వడం ఈ తీర్పులోని మరో విశేషం. అయోధ్య లోని ప్రస్తుత వివాదాస్పద స్థలమే శ్రీరాముడి జన్మస్థలమని విశ్వసించేందుకు ఆధారాలేంటనే విషయాన్ని కూలంకశంగా ఆ అనుబంధంలో వివరించారు. ఆ అనుబంధ రచయిత ఎవరో కూడా మిస్టరీగానే ఉంచడం కొనమెరుపు.

Related posts