telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రతి ఇంటిని రికార్డుల్లో నమోదు చేయాలి: మంత్రి పువ్వాడ

puvvada ajay

ప్రతి ఇంటిని రికార్డుల్లో నమోదు చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రజలకు సంబంధించిన వివరాలను రికార్డుల్లోకి ఎక్కించాలని తెలిపారు. ఈ విషయంలో ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని తెలిపారు.

నూతన రెవెన్యూ చట్టంలోని అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు. ఖమ్మం నగరంలోని ప్రభుత్వ స్థలాల్లో పేదలు నిర్మించుకున్న ఎలాంటి భద్రత లేని గృహాలకు మెరూన్ రంగు పాస్ బుక్ లు ఇస్తామని వెల్లడించారు.

మెరూన్ రంగు పాస్ బుక్ లపై ప్రజలకు వివరించాల్సిన బాధ్యతను స్థానిక కార్పొరేటర్లు తీసుకోవాలని, ప్రజల్లో ఈ పాస్ బుక్ లపై నెలకొన్న సందేహాలను తొలగించడానికి కార్పొరేటర్లు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Related posts