telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరోనా వస్తే గాంధీలో చికిత్స పొందుతా: మంత్రి పువ్వాడ

puvvada ajay

కరోనా వస్తే గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతానని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. కరోనా విషయంలో ప్రభుత్వాల వైఫల్యం ఉండదని అన్నారు. ఈ అంశంపై విపక్ష పార్టీలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. కరోనా విషయంలో అలర్ట్ చేయండంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

మన దేశ జనాభా ఎక్కువ కాబట్టే ఎక్కువ కరోనా కేసులు వస్తున్నాయని అన్నారు. కరోనా చెప్పి రాలేదని, ఒక ఉపద్రవంలా వచ్చిందని అన్నారు. 130 కోట్ల జనాభా ఉన్న మనం దేశంలో భౌతికదూరం పాటించడం అంత సులువు కాదని అన్నారు. అందుకే వైరస్ విస్తరిస్తోందని చెప్పారు. తెలంగాణలో రికవరీ రేటు ఎక్కువగా ఉందని తెలిపారు. మీడియాలో వస్తున్న నెగెటివ్ వార్తలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారన్నారు. అందుకే కరోనా రోగిని వెలివేసే విధానం సమాజంలో ఏర్పడిందని తెలిపారు.

Related posts