telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

వామన్ రావు కేసును మీడియా ఇన్వెస్టిగేషన్ చేస్తుందా పోలీసుల..?

నడిరోడ్డుపై న్యాయవాది దంపతులను హత్య చేయడం దుర్మార్గం గతంలోనే ఆయనకు ప్రాణహాని ఉందని హైకోర్టుకు తెలిపారు. నడి రోడ్డుపై మధ్యాహ్నం 2.10 గంటలకు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం.. కల్వచర్ల ప్రాంతంలో వాహనాలు వెళ్తున్నాయి. ఒక్కసారిగా క్రెటా కారు రాంగ్‌ రూట్‌లో దూసుకొచ్చింది. న్యాయవాది దంపతులను అడ్డగించారు. కారులో నుంచి దిగిన దుండగులు కత్తులతో రెచ్చిపోయారు. న్యాయవాది వామన్‌ రావుపై దాడి చేశారు. అయితే దీని పై జడ్పీ చైర్మన్ పుట్ట మధు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు వామన్ రావు హత్య కేసును మీడియా ఇన్వెస్టిగేషన్ చేస్తుందా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుందా? అని అయన ప్రశ్నించారు. ఫోర్త్ ఎస్టేట్ గా బావించే మీడియా ఒకసారి ఆలోచించాలని, కొంతమంది ఎప్పుడు పుట్ట మధును అరెస్టు చేస్తారని చూస్తున్నారని ఆయన అన్నారు. పేద బిడ్డ జడ్పీ చైర్మన్ అయితే సహించలేక పోతున్నారని ఆయన అన్నారు. పోలీసు విచారణ తర్వాత వాస్తవాలతో హైదరాబాద్లో మీడియా ముందుకు వస్తానని ఆయన పేర్కొన్నారు. ఇక ఎమ్మెల్యే శ్రీధర్ బాబు నేను రౌడీయిజం చేసినట్లు చెబుతున్నాడని, అసలు దొంగ రౌడీయిజం చేసింది శ్రీధర్ బాబు ఆయన తమ్ముడేనని ఆయన అన్నారు. మాతో ఎవరికీ ఇబ్బంది లేదు, శ్రీధర్ బాబుతోనే అందరికీ ఇబ్బంది ఉందని ఆయన అన్నారు.

Related posts