మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ‘పుష్ప లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నారు. సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. మొదటి భాగం ‘పుష్ప ది రైజ్’ పేరుతో విడుదల కానుంది. రీసెంట్ గా ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ఫస్ట్ పార్ట్ ను విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు .
ఇక సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా సోషల్ మీడియాలో భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేస్తోంది. బన్నీ కెరీర్ లోనే మొదటిసారిగా చేస్తున్న ఈ భారీ ప్రయోగం ఎలాంటి సంచనాలనలు సృష్టిస్తుందో అని ఇప్పటికే అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.
ఈ క్రమంలో దాక్కో దాక్కో మేక’ అంటూ సాగే పాటను విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రోమో కూడా వదిలింది. ఆగస్టు 13న ఫుల్ సాంగ్ ను విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇంతలోనే పాట లీక్ అయింది. కానీ లీకైన వెర్షన్ లో మాత్రం దేవిశ్రీప్రసాద్ గొంతు వినిపించింది. దాదాపు రెండు నిమిషాల పాట బయటకు వచ్చేసింది.
అలర్ట్ అయిన టీమ్..!మొదటి సాంగ్ కు సంబంధించి ప్రోమో తోనే సరి కొత్త ట్రెండ్ సెట్ చేశాడు. అయితే గ్రాండ్ గా విడుదల కావాల్సి ఫుల్ సాంగ్ గత రాత్రి నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సాంగ్ మొత్తం లీక్ అయినట్లు క్లియర్ గా అర్థం అవుతోంది. అయితే ఇది కావాలని లీక్ చేశారనే ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక రెండో పార్ట్ కు సంబంధించిన సినిమా షూటింగ్ ను ఈ ఏడాదిలోనే మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాదిలో రెండో భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది.