puri srikshetram temple key missing issue

పూరీ శ్రీక్షేత్రం మూడవ ‘తాళం’ ఆచూకీ తెలుస్తుందా?

125

విశ్వప్రసిద్ధ పూరీ శ్రీక్షేత్రం రత్నభాండాగారం మూడో గది తాళం చెవి లేదని కలెక్టర్‌ అరవింద అగ్రవాల్‌ స్పష్టం చేశారు. వెలకట్టలేని సంపదలున్న భాండాగారం ప్రధాన గదికి మూడు తాళాలున్నాయి. ఈ మూడింటిని పెట్టి తెరిస్తేనే తలుపు తెరుచుకుంటుంది. ఒక తాళం చెవి పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌దేవ్‌ వద్ద, మరో చెవి సెక్యూరిటీ సిబ్బంది వద్ద, మూడోది పాలనాధికారి వద్ద ఉంటుంది. 1985లో చివరిసారిగా ఈ గది తలుపులు తెరిచి మళ్లీ తాళాలు వేశారు. ఈ నేపథ్యంలో ముప్పై సంవత్సరాలకు పైగా వ్యవధి తర్వాత గత ఏప్రిల్‌ 4న హైకోర్టు ఆదేశాల మేరకు గదిని తెరవడానికి వెళ్లిన నిపుణులు, అధికారులు మూడవ ‘తాళం లేక లోనికి వెళ్లకుండా తిరిగొచ్చారు. కలెక్టర్‌ ఆధీనంలో ఉన్న తాళం చెవి లేకపోవడంతో వీరు మూడో గది లోపలికి వెళ్లలేకపోయారు. విషయాన్ని రహస్యంగా ఉంచినా ఇటీవల ఏర్పాటైన పాలకవర్గం సమావేశంలో బయటకు పొక్కింది.

puri srikshetram temple key missing issue

ఈ నేపథ్యంలో ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌ ఈ వ్యవహారం పై హైకోర్టు రిటైర్డ్ జస్టిస్‌ రఘువీర్‌దాస్‌ కమిషన్‌ ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారం పై ఏ కోణంలో దర్యాప్తు చేస్తారు, తాళం చెవి ఆచూకీ తెలుస్తుందా! భాండాగారం తలుపులు తెరిపించి ఆభరణాల లెక్కింపు దిశగా చర్యలు చేపడతారా అనే సందేహాలు భక్తుల్లో వ్యక్తమవుతున్నాయి. 1978లో శ్రీక్షేత్రం భాండాగారం తెరిపించిన ప్రభుత్వం సంపద లెక్కింపజేయించింది. ఆస్తుల రిజిస్టర్‌లో దీనికి సంబంధించి ఖచ్చితమైన ఆధారాలు లేవు. లోపల ఏముందన్న విషయమై ప్రస్తుత రాజు గజపతి వద్ద కూడా వివరాలు లేవు. ఆ సంపద మాత్రం భద్రంగా ఉందని అధికారులు చెబుతున్నారు. తాళం చెవి పోయిందన్న విషయం బహిర్గతం కావడంతో భక్తుల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడవ ‘తాళం’ పై ఇంత రాద్ధాంతం జరుగుతున్నా ఆలయ పాలనాధికారి స్పష్టంగా ఏ విషయమూ చెప్పడం లేదు.

puri srikshetram temple key missing issue

శ్రీక్షేత్రంలో సంస్కరణలు అమలు చేస్తామని, భక్తుల సౌకర్యాలు, భద్రతపై దృష్టి సారిస్తామన్న ప్రభుత్వం లోగడ జస్టిస్‌ బి.పి.దాస్‌ కమిషన్‌ ఏర్పాటు చేసింది. అది తొలి అధ్యయన నివేదిక సమర్పించింది. మరో నివేదిక సమర్పించాల్సి ఉండగా న్యాయశాఖ ఉపేక్షించింది. ఈ నేపథ్యంలో తాళం చెవి వ్యవహారంలో మరో కమిషన్‌ ఏర్పాటు చేసిన ప్రభుత్వం దీనికీ మూడు నెలల గడువిచ్చింది. ఈ వ్యవధిలో దర్యాప్తు చేస్తారా, ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి భాండాగారం తెరిపించి సంపద లెక్కిస్తారా అన్న
పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.