Purandeswari Fires on Chandrababu

చంద్రబాబు పై మండిపడ్డ పురందేశ్వరి

31
ఎపి ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  పై బిజెపి  మహిళా నాయకురాలు మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి, బిజెపి శాసన సభ పక్ష నేత విష్ణు కుమార్ రాజులు తీవ్రంగా మండిపడ్డారు.   బిజెపిని ఏపీ ద్రోహిగా చూపే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి ఏపీకి ఏమి ఒరగబెట్టారని ఆమె ప్రశ్నించింది.  ఏపీలో పెద్ద ఎత్త్తున అవినీతి జరుగుతోందని ఆరోపించారు.  బిజెపి పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె అన్నారు. కేంద్ర  నిధులను రాష్త్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.  అవినీతి ఆరోపణల పై సిబిఐ విచారణకు టిడిపి ప్రభుత్వం సిద్ధాంగా ఉందా అని సవాలు విసిరారు.   
 
రాష్త్ర ప్రభుత్వం చొరవ చూపడంతోనే నవయుగ పనులు వేగవంతమయ్యాయని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.  పోలవరం పనులను త్వరితగతిన  పూర్తి చేయాలనీ నవయోగ సంస్థను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ  ఢిల్లీకి పిలిపించి ఆదేశాలు జారేచేశారన్నారు.  నవయుగ  సంస్థ పై గడ్కరీ చేసిన ఒత్తిడి గురించి టీడీపీ నేతలు రాష్త్ర ప్రజలకు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు.  బిజెపి నేతల పై జరుగుతున్న  దాడులను సహించేది లేదని ఆమె హెచ్చరించారు.  
 
2014 లో బీజీపీ తో కల్సి పోటీ చేయడంతోనే  టీడీపీ లబ్ది  పొందిందని  విష్ణు కుమార్ రాజు అన్నారు. కానీ స్వప్రయోజనాల కోసం  మధ్యలోనే  దోస్తీకి  గుడ్ బై చెప్పారన్నారు. ప్రత్యేక హోదా పై మాటమార్చారని  చంద్రబాబు  అనడం సరికాదన్నారు.  పట్టిసీమలో జరిగిన  అవినీతి పై  సిబిఐ  విచారణ జరిపించాలని కోరినప్పటికీ  ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు .  పంపుసెట్ల వియంలో 60 కోట్ల జరిగిందని, పెన్షనర్లను  బెదిరించి  నవానిర్మాణ దీక్షలకు తీసుకొస్తున్నారని  2019 ఎన్నికల్లో టీడీపీ కీ  ప్రజలే  తగిన  గుణపాఠం నేర్పుతారన్నారు.