pune police relesed videos of Bhima Koregaon violence

భీమా కోరెగాన్ అల్లర్ల వీడియో దృశ్యాలు విడుదల… ఐదుగురు అరెస్ట్

37

జనవరి 1, 2018 న భీమా కోరెగాన్ అల్లర్లలో ఓ యువకుడు మృతి చెందాడు, అతడిని హత్యచేసినట్టు అప్పటిలో విచారణలో తేలటంతో నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. దీనిలో భాగంగా ఆ అల్లర్లు జరిగిన ప్రాంతంలో ఉన్న వీడియో లను విడుదల చేయగా అందులో సదరు యువకుడిని కొంతమంది ఆ అల్లర్లలో భాగంగా చేసుకొని హత్య చేసినట్టు తేలింది.

రాహుల్ పేతంగాడే అనే యువకుడిని దుండగులు కర్రలతో, రాళ్లతో కొట్టి చంపినట్టు పోలీసుల విచారణంలో తేలింది. ఈ ఘటన సనాస్వాడి లో జరిగిన అల్లర్లలో భాగంగా జరిగినట్టు తెలిసింది.

పూణే సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ (ఎస్.పి), అక్కనౌరు ప్రసాద్ ఈ వివరాలను ఒక జాతీయ మీడియాతో చెప్పారు. ఈ ఘటనపై సంబందించిన వీడియోలను. ఫోటోలను విడుదల చేశారు. ఆ వీడియోలో అతడిని పైన చెప్పినట్టు రాళ్లతో, కర్రలతో కొట్టి హత్య చేసినట్టు తేలడంతో నిందితులను పట్టుకోడానికి ఆధారాలు దొరికాయని తెలిపారు.

ముగ్గురు దుండగులను ఈ వీడియోలను ఆధారం చేసుకొని అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు.

ఈ అల్లర్లలో చాలా మంది కి సంబంధాలు ఉన్నాయని, వారి మొఖాలు వీడియో లో సరిగా లేవని, అయినా విచారణ జరుగుతుందని తెలిపారు అధికారులు.

నిందితులను పట్టుకోడానికి ప్రజలు కూడా సహకరించాలని ప్రసాద్ కోరారు. అయితే పోలీసులు ఈ అల్లర్లతో సంబంధం ఉన్న వారిని ఐదుగురిని ఖైదు చేసినట్టు పూణే పోలీసు అధికారి రవీంద్ర కడం తెలిపారు. పోలీసుల అదుపులో ఉన్నవారికి నక్సల్స్ తో సంబంధాలు ఉన్నట్టు కూడా వారు చెప్పారు.

ఖైదు చేసిన వారిలో సురేంద్ర గడీలింగ్, సుధీర్ దవాలె, రానా జాకోబ్, షోమా సేమా మరియు మహేష్ రౌట్ ఉన్నారు. వీరికి 14 జూన్ వరకు కస్టడీ విధించారు.

1818లో జరిగిన భీమా కోరెగాన్ యుద్ధం గురించి ఆరోపణలు చేయటంతో ఈ అల్లర్లకు నాంది పలికింది. ఈ అల్లర్లలో పలువురు గాయపడ్డారు. వారిలో 10 మంది పోలీసు వారు కూడా ఉన్నారు.