telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వారికి అవసరమున్నదే చూపిస్తారు… “బిగ్ బాస్”పై పునర్నవి కామెంట్స్

Punarnavi

‘బిగ్ బాస్’ సీజన్ 3లో పునర్నవికి ఎక్కడలేని పాపులారిటీ వచ్చేసింది. ముఖ్యంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో ఆమెస్నేహం ‘బిగ్ బాస్’ షోకే ఒక క్రేజ్ తీసుకొచ్చింది. తాజాగా పునర్నవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడుతూ షో పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. బిగ్‌బాస్‌ షో మొత్తం ఎడిట్‌ చేసి చూపిస్తారని, లోపల ఏం జరిగినా వారికి అవసరమున్నదే చూపిస్తారని, అది జనాలు నిజమే అనుకుంటారని చెప్పింది. హౌస్ మేట్స్ అందరితో టచ్‌లో ఉన్నానని పునర్నవి తెలిపింది. అందరూ మాట్లాడతారని, ఈవెంట్లకు కూడా పిలుస్తారని, అయితే తనకు సమయం ఉంటే వెళ్తానని పునర్నవి చెప్పుకొచ్చింది. పునర్నవి భూపాలం వెండితెరపై మెరిసి తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే నటించింది తక్కువ సినిమాల్లోనే అయినా.. మంచి పేరును తెచ్చుకుంది. పిట్టగోడ, ఉయ్యాల జంపాల, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి సినిమాల్లో మంచి నటనను కనబర్చింది. అయితే సినిమాల ద్వారా కంటే బిగ్‌బాస్ షో ద్వారానే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది.

Related posts