telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-3 : రాహుల్ ప్రపోజ్ చేస్తే… పునర్నవి కామెంట్స్

punarnavi out from bigg boss house

బిగ్ బాస్-3 తెలుగు విజయవంతంగా కొనసాగుతోంది.నాగార్జున వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హిరిస్తున్నారు. గ‌డిచిన ఆదివారం బిగ్‌బాస్ హౌస్ నుండి పున‌ర్న‌వి బ‌య‌ట‌కు వ‌చ్చింది. పునర్నవి ఎలిమినేషన్ సమయంలో రాహుల్ వెక్కి వెక్కి ఏడ్చాడు కూడా. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న స‌మ‌యంలో రాహుల్ సిప్లిగంజ్‌, పున‌ర్న‌వి మ‌ధ్య ఏదో ఉందంటూ వార్త‌లు విన‌ప‌డుతూ వ‌చ్చాయి. ఈ వార్త‌ల‌పై హౌస్ నుండి బ‌య‌ట‌కు పున‌ర్నవి క్లారిటీ ఇచ్చింది. తాను, వ‌రుణ్ సందేశ్‌, వితిక‌, రాహుల్ చాలా మంచి స్నేహితుల‌మ‌ని చెప్పిన పున‌ర్న‌వి. త‌న‌కు, రాహుల్ మ‌ధ్య ఏం లేద‌ని, ఇద్ద‌రం చాలా మంచి మిత్రుల‌మ‌ని చెప్పింది. ఒక‌వేళ బిగ్‌బాస్ మూడో సీజ‌న్ ముగిసిన త‌ర్వాత రాహుల్ మీకు ప్ర‌పోజ్ చేస్తే మీ రియాక్ష‌న్ ఏంటి? అని ప్ర‌శ్నిస్తే బిగ్‌బాస్ హౌస్‌లో రాహుల్‌ని చాలా తిట్టాను. ఇప్పుడు రాహుల్ ప్ర‌పోజ్ చేస్తే.. ఎందుకురా? ఇప్పుడిది అని చెప్పి గ‌ట్టిగా తిడ‌తాను అంటూ పున‌ర్న‌వి త‌న‌కు రాహుల్‌కు మ‌ధ్య ఏం లేద‌నే విష‌యాన్ని తేల్చేసింది.

Related posts